కెరీర్ లో ఫస్ట్ టైం.. ఆ సినిమా హిట్ అయినందుకు వెక్కి వెక్కి ఏడ్చిన మహేశ్ బాబు.. ఎందుకో తెలుసా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు మనం ఎక్కువగా వింటున్నాం . మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో పాత తాలూకా వార్తలకు సంబంధించిన విషయాలను ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు . రీసెంట్గా సోషల్ మీడియాలో మహేష్ బాబుకి సంబంధించిన ఒక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాలో నటించిన మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళితో సినిమా కోసం ఫిట్నెస్ కోసం జర్మనీ వెళ్లారు .

అక్కడ ఒక డాక్టర్ ని ప్రత్యేకంగా కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు . దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి . అయితే మహేష్ బాబు తన కెరియర్ లో ఒక సినిమా హిట్ అవ్వడం వల్ల వెక్కి వెక్కి ఏడ్చాడట . ఆ సినిమా మరేదో కాదు “నాన్నకు ప్రేమతో”. సుకుమార్ మొదటగా ఈ కథను మహేష్ బాబుకి వివరించారట . సెంటిమెంట్ సినిమా కావడంతో రిజెక్ట్ చేశాడట మహేష్ .

ఆ తర్వాత ఈ సినిమాను ఓకే చేశాడు ఎన్టీఆర్. కలెక్షన్స్ పరంగా పక్కన పెడితే.. టాక్ ప్రకారం మాత్రం అందరి మనసులను హత్తుకునింది ఈ నాన్నకు ప్రేమతో సినిమా . ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినప్పటికీ అభిమానుల మనసులను టచ్ చేసింది . ఇంత మంచి సినిమాని ఎలా మిస్ చేసుకున్నాను అంటూ సినిమా రిలీజ్ అయి హిట్ కొట్టిన తర్వాత మహేష్ బాబు బాగా బాధపడ్డారట . అప్పట్లో ఈ వార్త వైరల్ అయింది. మరొకసారి ఇదే వార్తను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!