“ఏం చేసుకుంటారో చేసుకోండి..ఆ సినిమాలో నేను చచ్చిన చేయను”.. తెగేసి చెప్పేసిన అమల..ఎందుకో తెలుసా..?

అమల .. సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇప్పుడు స్టార్ హీరో భార్య గా తనదైన స్టైల్ లో ముందుకు వెళుతుంది . అమల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ..అందానికి అందం ..నటనకి నటన మంచితనానికి మంచితనం . తన పని తాను చూసుకొని వెళ్ళిపోతుంది . పక్క వాళ్ళ మేటర్ లో వేలు పెట్టదు .. తన మ్యాటర్లోకి వేలు పెట్టిన సైలెంట్ గా ఉండిపోతుంది . మంచితనానికి మరో మారుపేరు అమల అంటూ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి.

జనాలు కూడా అమలను తెలుగు ఇంటి కోడలుగా బాగా యాక్సెప్ట్ చేశారు. అయితే నాగార్జున అమల కాంబోలో ఓ సినిమా రావాల్సింది. కానీ ఆ సినిమాలో నటించను అంటూ ఆమె స్వయంగా అమల నే చెప్పుకొచ్చిందట . ఆ మూవీ మరేదో కాదు మనం . విక్రం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున – నాగచైతన్య – అఖిల్ – నాగేశ్వరరావు గారు కలిసినటించారు.

ఈ సినిమాలో శ్రేయ పాత్ర కోసం ముందుగా అమలనే అనుకున్నారట మేకర్స్. అందరు అక్కినేని ఫ్యామిలీ అయితే ఇంకా బాగుంటుంది అనుకున్నారట. అయితే అమల రిజెక్ట్ చేయడంతో ఈ పాత్ర శ్రేయ వద్దకు వెళ్ళింది. ఒకవేళ ఈ పాత్ర అమలా చేస్తుంటే సినిమా చరిత్ర సృష్టించి ఉండేది అని చెప్పడంలో సందేహం లేదు. అంతేకాదు నాగార్జున ఎంత రిక్వెస్ట్ చేసిన అమల ఒప్పుకోలేదట. ” ఏం చేస్తారో చేసుకోండి నేను ఈ సినిమాలో నటించను అంటూ తెగేసి చెప్పేసిందట”..!!