‘ గ్యాంగ్ లీడర్ ‘ మూవీ అసలు చేయనని మొండిగా చెప్పిన చిరు.. మళ్ళి నటించడానికి కారణం ఏంటంటే..?

చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక క్రేజ్‌ దక్కించుకున్నాడు. 150కి పైగా సినిమాల్లో నటించిన చిరు.. ఎన్ని సినిమాలతో హిట్ కొట్టిన అతనికి మెగాస్టార్ అనే బిరుదు రావడానికి ముఖ్యమైన కారణం మాత్రం గ్యాంగ్ లీడర్ సక్సెస్ అనడంలో సందేహం లేదు. ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో ఓ మైలురాయిగా మిగిలిపోయింది. కలెక్షన్ పరంగా కూడా బీభత్సవం సృష్టించిన ఈ మూవీలో విజయశాంతి హీరోయిన్గా నటించిన.. ఈ సినిమాలో వీరిద్దరి రొమాన్స్, పాటలు బ్రహ్మాండమైన సక్సెస్ అందుకున్నాయి.

కేవలం పాటల కోసం ఈ సినిమాను ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూశారంటే ఆ మూవీ మ్యూజిక్ పరంగా ఎలాంటి సక్సెస్ అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. కాగా మొదట గ్యాంగ్ లీడర్ సినిమాను చిరంజీవి చేయానంటే.. చేయనని చెప్పేసాడట. అయితే చేయను అన్న సినిమాను ఎలా నటించాడు అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. విజయ బాపినీడు ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించాడు. అయితే ఈ సినిమా కంటే ముందు ఆయ‌న‌ పట్నం వచ్చిన పతివ్రతలు, హీరో, మగధీరుడు లాంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.

ఏదైనా సరికొత్త కథతో చిరంజీవికి మంచి విజయం అందించాలని ఆలోచించిన ఆయన గ్యాంగ్ లీడర్ కథను చాలా కష్టం మీద రెడీ చేసుకొని చిరంజీవికి వినిపించగా.. కథ విన్న చీరు.. ఈ సినిమా ఆడదు నేను ఇందులో నటించడం కుదరదు అంటూ ముఖంపై కరాకండిగా చెప్పేసాడట. దీంతో తీవ్ర నిరాశకులోనైనా విజయబాపినీడు.. సరాసరి పరుచూరి బ్రదర్స్ దగ్గరకు వెళ్లి కథను వినిపించగా.. కథ మొత్తం విన్న పరుచూరి.. దాంట్లో కొన్ని లోపాలు గమనించి వాటిని సరి చేయడానికి మూడు రోజులు టైం అడిగాడట.. ఆ విషయాన్ని చిరంజీవికి చెప్పగా పరుచూరి బ్రదర్స్ పై ఉన్న నమ్మకంతో సినిమాకు ఓకే చేశాడట.

అలా కథలో కొన్ని మార్పులు చేసి చిరంజీవికి వినిపించగా ఆయన ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఇక అల్లు అరవింద్ కి డేట్స్ విషయం ఎడ్జస్ట్ చేయమని చెప్పారట. అల్లు అరవింద్ కూడా పరచూరి గోపాలకృష్ణ చేత కథ విని.. రికార్డ్ చేసుకుని మరి మరోసారి వినడట.. ఎందుకు అలా చేశారు అంటే.. మీరు మాటలతో మాయాజాలం చేస్తారు.. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఓసారి రికార్డు విని కథ ఎలా ఉందో చెప్తా అంటూ వివరించాడట. అలా మొద‌లైన‌ ఈ సినిమా తర్వాత ఎంతటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు.