ఆ టాలీవుడ్ స్టార్ హీరో రష్మికకు అన్నయ్య అవుతాడా..? కొత్త బంధాన్ని బయటపెట్టిన నేషనల్ క్రష్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. హీరో నాగశౌర్యకు సిస్టర్ అవుతుందా..? అంటే ఎస్ అని అంటున్నారు జనాలు ..అభిమానులు ఈ న్యూస్ తెలుసుకొని షాక్ అయిపోతున్నారు. కన్నడ ఇండస్ట్రీలో “కిర్రాక్ పార్టీ” ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి ఛలో సినిమా ద్వారానే ఎంట్రీ ఇచ్చింది .

మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తూ వచ్చింది . మహేష్ బాబు – బన్నీ లాంటి స్టార్ హీరోల సినిమాలతో బ్రేక్ లేకుండా దూసుకుపోతున్న రష్మిక మందన్నా – నాగశౌర్యకు సిస్టర్ అవుతుంది అన్న వార్త ఇప్పుడు నెట్టింట మారుమ్రోగి పోతుంది. ఛలో సినిమా షూట్ టైంలో నాగశౌర్య అమ్మానాన్నగారు షూట్ కి వచ్చినప్పుడు రష్మిక మందన్నా..చాలా ప్రేమగా ఆప్యాయంగా అచ్చం కూతురులానే మాట్లాడిందట .

దీంతో అప్పుడే వాళ్ళు నువ్వు మా కూతురివి అని మమ్మల్ని మమ్మీ డాడీ అంటూ పిలవమంటూ చెప్పుకొచ్చారట . ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ నాగ శౌర్య పేరెంట్స్ ని మమ్మీ డాడీ అంటూ పిలుస్తుందట రష్మిక . అలా నాగశౌర్యకు సిస్టర్ అయిపోయింది రష్మిక మందన్నా. నాగ శౌర్య ..అనూష శెట్టి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయాడు. చేతికి వచ్చిన పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.