ఉల్లి చేసే మేలు.. తల్లి కూడా చెయ్యదు.. కానీ పూజా సమయంలో ఉల్లి, వెల్లుల్లిని ఎందుకు వాడరు?

సాధారణంగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని ఒక సామెత పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే హిందూ సంప్రదాయంలో మాత్రం పూజలు, గుడికి వెళ్లేటప్పుడు ఉల్లి, వెల్లుల్లి ని తినరు. పూజలు, వ్రతాలతోనే కాదు.. ఆచారాలను నిష్టగా పాటించేవారు చాలామంది ఉన్నారు. కొంతమంది ఉల్లి, వెల్లుల్లి తో చేసిన ఆహార పదార్థాలను అస్సలు ముట్టుకోరు.

అసలు ఈ విధమైన సాంప్రదాయం ఎందుకు వచ్చింది? అసలు ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరు అనేది ఇప్పుడు చూద్దాం. ఆయుర్వేదం ప్రకారం.. మనం తీసుకునే ఆహారం మొత్తం మూడు భాగాలుగా విభజించారు. అవే స్వాతిక, రాజసిక, తామాసికం. ఇవి ఒక్క గుణం పెంచడం, తగ్గించడం చేస్తాయి.

ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం, మసాలా దినుసులు ఇంకా కొన్ని మూలకాలు రాజసికత్వానికి చెందినవి. వీటిని తీసుకోవడం వల్ల కోపం, ఏకాగ్రత లోపం కలుగుతాయి. నిష్టగా ఉండే వారి మనసును ఇవి మళ్లీస్తాయట. అందుకే ప్రత్యేక సందర్భాలలో.. ముఖ్యంగా ఎక్కువ సేపు ఏకాగ్రతతో చేయాల్సిన పూజలు, వ్రతాలలో ఆహారాలలో వాటిని నిషేదించారు. ఉల్లి, వెల్లుల్లి పెరిగే ప్రదేశం శుచి, శుభ్రత లేకుండా ఉంటాయని అందుకే వాటిని దూరంగా ఉంచుతారు.