వాల్ నట్స్ తో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. ఖరీదైన కచ్చితంగా రోజు తింటారు..

ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తిన‌టం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం చాలామందికి తెలుసు. అయితే డ్రై ఫ్రూట్స్ అంటే పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. ఇక ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు డ్రైఫ్రూట్స్ లో సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో విటమిన్స్, పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ తరచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక ఇలాంటి డ్రై ఫ్రూట్స్ లోనే వాల్నట్స్ రోజుకు రెండు మూడు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెప్తున్నారు. ధర ఎక్కువగా కావడంతో చాలామంది డ్రై ఫ్రూట్స్ ని చాలా తక్కువగా వాడుతూ ఉంటారు. ఇక వాల్నట్స్ జోలికి అయితే పోనే పోరు.

అయితే డ్రై ఫ్రూట్స్ లో వాల్‌న‌ట్స్ లో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. మెదడు ఆకారంలో ఉండే వాల్‌న‌ట్స్ లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. వాటిని అక్రోట్స్ అని కూడా అంటారు. రోజుకు 3,4 వాల్నట్స్ నానబెట్టి తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వాల్నట్స్ విటమిన్ బి6, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, రాగి, సెలీనియం, ఒమేగా- 3, ఫ్యాటీ ఆసిడ్స్ లాంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వాల్‌న‌ట్స్ లోని ఎసెన్షియల్ ఆమ్లాలు మెదడు పనితీరును వేగవంతం చేస్తాయి. ఏకాగ్రతను పెంచి.. ఎల్జిడిమాండ్షియా వచ్చే అవకాశాన్ని అరికడతాయి.

వాల్‌న‌ట్స్ లో విటమిన్లు, కాల్షియం, పొటాషియం, సోడియం, కాపర్, ఐరన్, మాంగనీస్ పోషకాలు శరీర దృఢత్వానికి తోడ్పడుతాయి. రోజూ వాల్‌న‌ట్స్ తింటే రక్తహీనతకు దూరంగా ఉండవచ్చు. ఫ్రీ బయోటిక్ కాంపౌండ్స్ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచి చెడు బ్యాక్టీరియాను తొలగిస్తాయి. బరువు కూడా తగ్గడానికి సహకరిస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. అందుకే త్వరగా ఆకలివేదు దీంతో బరువు తగ్గవచ్చు. అలాగే వాల్‌న‌ట్స్ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటా ఇన్ఫ్లమెంటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

రోజు వాల్‌న‌ట్స్ ను తింటే ఆర్థరైటిస్ తో వచ్చే నొప్పులు వాపులకు మెల్లమెల్లగా చెక్ పెట్టవచ్చు. వాల్ నట్స్ లో ఆల్ఫాలినోలని కేసరి పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వానికి, దంతాలను బలోపేతం చేయడానికి సహకరిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ కూడా వాల్నట్స్ లో ఉంటాయి. కనుక కాస్ట్ గురించి ఆలోచించకుండా ఇప్పటినుంచి రోజు వాల్‌న‌ట్స్ తినడం అలవాటు చేసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.