దానిమ్మ పండు తొక్కతో కూడా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. కచ్చితంగా తెలుసుకోవాలి..

చాలామంది వారి డైట్ ప్లాన్ లో దానిమ్మ పండును కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పోషక విలువలు ఉంటాయని అందరికీ తెలుసు. దానిమ్మ పండు తినడం వల్ల రక్త కణాలు అభివృద్ధి, గుండె సమస్యలు, డయాబెటిస్వంటి సమస్యలు తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ పండు తొక్కతో కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు వివరించారు. దానిమ్మ పండు తొక్కతో కలిగే లాభాలు ఏంటో ఒకసారి చూద్దాం.

 

దానిమ్మ తొక్కలో వివిధ రకాల పోషకాలు దాగి ఉన్నాయట.ముఖ్యంగా ప్రోటీన్, పొటాషియం, కాల్షియం లాంటి ఆరోగ్యకరమైన పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. దానిమ్మ తొక్కలో అనారోగ్యకరమైన వ్యాధులను తొలగించే శక్తి ఉంటుంది. ఇవి యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కలిగి వ్యాధులను నివారించడానికి సహకరిస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఇది శారీరక ఆరోగ్యానికే కాక చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో సహకరిస్తుంది.

దానిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడిగా చేసి తేనె, నిమ్మ‌ రసంలో కలిపి చర్మం పై రాసుకోవడం వల్ల ముఖంపై వచ్చే చర్మ సమస్యలకు తగ్గుముఖం పడతాయ‌ని నిపుణులు చెప్తున్నారు. దానిమ్మ తొక్కతో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఎంత ప్రయోజన కారిగా ఉంటుంది. కీళ్లనొప్పులు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి దానిమ్మ తొక్కలను మరిగించి జ్యూస్ చేసుకొని తాగాలి. దీనివల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది. దానిమ్మ పండు తొక్కలు ఉపయోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని డాక్టర్లు చెప్తున్నారు.