హీరో రవితేజ పిచ్చోడు అని చెప్పడానికి .. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలా..?

రవితేజ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ ప్రారంభించి.. ఆ తర్వాత కమెడియన్ గా .. ఆ తర్వాత హీరోగా ఇప్పుడు ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా పాన్ ఇండియా హీరోగా తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నాడు . సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కూడా రవితేజ అంటే స్పెషల్ అరుపుల వినపడతాయి . దానికి కారణం కష్టానికి మరో మారుపేరే . చిరంజీవి తర్వాత అలాంటి ఓ క్రేజ్ అందుకున్న హీరో కేవలం రవితేజ నే కావడం గమనార్హం .

మిగతా హీరోలు నాన్నలు , తాతలు పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ చిరంజీవి తర్వాత రవితేజ, నాని మాత్రమే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. కాగా రీసెంట్గా రవితేజ నటించిన ఈగల్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సింది . కానీ ఆయన తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఈగల్ ఫిబ్రవరి 9న విడుదల చేయాలి అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ విషయం తెలిసిన మాస్ మహారాజ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు .

సినిమా ఇండస్ట్రీలో హీరోలు అంటే ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి అని.. అది మా రవితేజకు బ్లడ్ లోనే ఉంది అని ఈగల్ ని పోస్ట్ పోన్ చేసుకోవడమే కాకుండా తన మూవీతో పోటీపడుతున్న హనుమాన్ కు ఎలాంటి ఈగో లేకుండా వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో మంచి విషయం అని చెప్తున్నారు . మాస్ మహారాజాది గోల్డెన్ హార్ట్ అంటూ పోగిడేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో రవితేజ పోస్టర్స్ వైరల్ గా మారాయి..!!