సంక్రాంతి సినిమాల ఓటీటీ సంస్థల లిస్ట్ ఇదే..

సంక్రాంతి బరిలో ఈసారి తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి. తమిళ్ నుంచి రెండు సినిమాల రిలీజ్ కాన్నాయి. అయితే ఈసారి మాత్రం తెలుగు ప్రేక్షకులకు తమిళ్ డబ్బింగ్ సినిమాలు చూసే అవకాశం లేదు. కాగా ఇప్పటికే ఈ నాలుగు తెలుగు సినిమాల డిజిటల్ రైట్స్ కూడా ప్రముఖ ఓటీటీ సంస్థలు ఫ్యాన్సీ రేట్లు చెల్లించి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఏఏ సినిమాలు ఏ ఏ సంస్థ‌లు పొంతం చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో వ‌స్తున్న గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రీ లీల మెయిన్ హీరోయిన్‌గా, మీనాక్షి చౌదరి సెకండ్ లీడ్‌లో నటిస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. సినిమా రిజల్ట్ ను బట్టి ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారట.

తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో సూపర్ మ్యాన్ స్టోరీగా హనుమాన్ మూవీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ డిజిటల్ రైట్స్ జి5 ఓ ఫాన్సీ ధరకు సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో జీ 5 దక్కించుకున్న పెద్ద సినిమా ఇదే కావడం గమనార్హం. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓటీటీలో కూడా ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇక రిలీజ్ కంటే ముందే ఈ సినిమాపై పాజిటివ్ బజ్‌ ఏర్పడింది.

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొల‌ను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సైంధవ్‌. కూతురు సెంటిమెంట్‌తో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో కూతురు ప్రాణాలు కాపాడుకోవడం కోసం తండ్రీ ఏవిధంగా కష్టపడతాడు.. ఎలా చివరకు ఆమెను కాపాడుకుంటాడు.. అనే అంశాన్ని తెరకెక్కించారు. జనవరి 13న రిలీజ్ కాబోయే సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకుంది.

ఇక కింగ్ నాగార్జున నా సామిరంగా మూవీ సంక్రాంతి బ‌రిలో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ డిస్నీ ప్ల‌స్‌ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. మలయాళ మూవీ రీమెక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో ఎలాగైనా హీట్ కొట్టాలని నాగార్జున కసితో ఉన్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్, టీజర్ అయితే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక అలాగే తమిళ్ హీరో ధనుష్ హీరోగా నటించిన క్యాప్టెన్‌ మిల్లర్, శివ కార్తికేయన్ రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన అయాలన్‌ రెండు సినిమాలను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది.