“గుంటూరు కారం విషయంలో జరిగిన బిగ్ మిస్టేక్ అదే”.. తప్పు ఒప్పుకున్న నాగ వంశీ..!!

“గుంటూరు కారం”.. ఏం ముహూర్తాన స్టార్ట్ అయిందో తెలియదు కానీ.. మొదల నుంచి ఎండింగ్ వరకు అన్ని అవాంతరాలు అవరోధాలే . ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకుంది . ఆ తర్వాత సినిమాకి సంబంధించి నెగటివ్ అంశాలు ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి . అంతేకాదు మహేష్ బాబు అమ్మానాన్నగారు ఈ సినిమా చేస్తున్న టైం లోనే మరణించారు . ఆ తర్వాత సినిమాపై ఎలాంటి వార్తలు వినిపించాయో మనకు తెలిసిందే . సరే సినిమా రిలీజ్ అయిన తర్వాత అయినా బాగుంటుందా అనుకుంటే కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తుంది .

కానీ టాక్ ప్రకారం గా మాత్రం సినిమా దూల తీర్చేస్తుంది. హిట్ అనికాకుండా ఫట్ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోని నాగవంశీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అలాంటి నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి ఇచ్చి పడేశారు . “సినిమా బాగోలేదు అంటున్నారు కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం బాగా కలక్ట్ చేసి పెడుతుంది.. మేకర్స్ కి లాభాలు వస్తున్నాయి.. ఇంకా ఎందుకు నెగిటివ్ టాప్ క్రియేట్ చేస్తున్నారు అర్థం కావడం లేదు”.

“గుంటూరు కారం విషయంలో మేము చేసిన ఒకే ఒక్క మిస్టేక్ బెనిఫిట్ షో లు వేయడం . అర్ధరాత్రి ఒంటిగంటకు వచ్చే ఫ్యాన్స్ సినిమాలో ఎక్కువగా మాస్నెస్ ని కోరుకున్నారు మాస్నెస్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉండడంతో కాస్త బెడిసి కొట్టింది ..అంతే ఒకవేళ మేము అర్ధరాత్రి షోలు వేయకుండా ఉండి ఉంటే సినిమాకి మొదటి నుంచి పాజిటివ్ టాక్ వచ్చేదేమో” అంటూ తప్పుని ఒప్పేసుకున్నాడు నాగ వంశీ..!!