తేనెతో కలిపి వీటిని తీసుకుంటే విషంతో సమానం.. కచ్చితంగా తెలుసుకోండి..

సహజంగా తేనె తీపిని అందించడంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని నిపుణులు చెబుతూ ఉంటారు. ఇందులో ఎన్నో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కానీ తేనెను సరైన విధంగా ఉపయోగించకపోతే మన శరీరం పైన చెడు ప్రభావాన్ని కూడా చూపుతోందట. అసలు తేనెను ఏ విధంగా వాడితే విష పదార్థంగా మారుతుందో ఒకసారి చూద్దాం. బాగా వేడిగా ఉండే నీటిలో తేనెను కలుపుకొని తాగడం వల్ల విషం గా మారుతుందట. పొరపాటున అతిగా వేడిగా ఉండే నీటిలో తేనె కలిపి తాగితే వికారం, కంగారుగా, విరోచనాలు కావడం.. ఒక్కసారిగా వాంతులు ఇలాంటివన్నీ జరుగుతాయి.

అలాగే తేనెను వేడి ఆహారంతో కూడా కలిపి తీసుకోకూడదు. తేనె ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం. దానిని మనం అలానే సేవించడం తప్ప వేడి చేసిన వాటిలో వాడితే అది విషయంగా మారుతుందని ఎన్నో హెల్త్ ఇష్యూస్‌ను ఫేస్ చేయాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. తేనెను ముల్లంగి రసంలో కలిపి తీసుకుంటే అది ఫుడ్ పాయిజన్ కు దారితీస్తుంది. శరీర అవయవాలకు హాని కల్పిస్తుంది. వేడి టీలో, కాఫీలో అసలు తేనును కలుపుకోవద్దు. అది పోయిజ‌న్‌తో సమానం. శరీరంలో టెంపరేచర్ను పెంచేసి వికారం, కడుపులో నొప్పి.. మంట సమస్యలు తలెత్తేలా చేస్తుంది.

అలాగే మాంసాహారం, చేపలు వంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు కూడా తేనెను తీసుకోకూడదు. వీటి వల్ల శరీరానికి చెడు ప్రభావం కలుగుతుంది. తేనెను ఎప్పుడు ఫ్రిజ్లో పెట్టకూడదు. దీనిని రూమ్ టెంపరేచర్ లోనే ఉంచితే తేనె పాడవకుండా ఉంటుంది. అయితే తేనెను అసలు ఏ విధంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది.. ఒకసారి చూద్దాం. గోరువెచ్చని పాలలో కానీ నీటిలో కానీ తేనెను కలుపుకొని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదట. డైరెక్ట్ గా తేనెను సేవించిన కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే రోజుకు రెండు మూడు టీ స్పూన్ల కంటే ఎక్కువగా తేనెను వాడకూడదు.