ఆ స్టార్ హీరో కొడుకుతో సితార రొమాన్స్..? వరసలు మారిపోతాయ్ రోయ్..జాగ్రత్త..!

సితార ఘట్టమనేని ..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తండ్రి పెద్ద హీరో ..తాత సూపర్ స్టార్ హీరో ..తల్లి ఒకప్పటి హీరోయిన్.. ఇలా సితార మొదటి నుంచి బాగా పాపులారిటీ సంపాదించుకుంది . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ చిన్నతనంలోనే పెద్ద మనసును చాటుకునింది . అంతేకాదు సితార కి హీరోయిన్ అవ్వాలని ఉంది .

ఆమె కచ్చితంగా వెండితెరపై మెరుస్తుంది అంటూ తల్లి నమ్రత తండ్రి మహేష్ బాబు ఎప్పుడో అభిమానులకి పరోక్షకంగా హింట్ ఇచ్చేశారు . అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సితార ఘట్టమనేని హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే సమయానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో కొడుకు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తాడని .. వీళ్లిద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుంటుంది అని ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఆ స్టార్ హీరో కొడుకుతో సితార సినిమా వద్దు అంటున్నారు . సితార ట్రెడిషనల్ గా ఉండే పాత్రను చూస్ చేసుకుంటేనే బెటర్ అని ఇండస్ట్రీలోకి వచ్చాక హీరోయిన్స్ కొన్ని హద్దులు మీరాల్సిన పనులు చేయాల్సి ఉంటుందని.. అలా సితార చేస్తే మహేష్ బాబు అభిమానులు తట్టుకోలేరని చెప్పుకొస్తున్నారు. మరి కొందరు మహేష్ కూతురు ఆ స్టార్ హీరో కొడుకుతో రొమాన్స్ చేస్తే వరుసలు మారిపోతాయి అంటూ వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!