డీప్ ఫేక్ వీడియో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిపై రష్మిక సంచలన కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ స్టార్ట్ బ్యూటీ రష్మిక మందన్న డిప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి నెట్టింట దూమారం రేపిన ఆ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ వ్యక్తి వివరాలు ఏవి మీడియాకు లీక్ చేయలేదు. అన్నిటినీ గోప్యంగా ఉంచి విచారణ చేస్తున్న పోలీసులు.. పలువురు నటీమణులకు కూడా డీప్ ఫేక్ బారిన పడడంతో వాటి వెనుక ఉన్న వారు ఎవరు.. వారితో కూడా అతనికి సంబంధం ఉందా.. అన్ని వీడియోలు చేసింది ఒక్కడైనా.. అనే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Delhi Police arrests Guntur man for Rashmika Mandanna deepfake video

ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక మందిన ఢిల్లీ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇన్‌స్టా లో ఓ పోస్ట్ ని షేర్ చేసింది. నాపై వచ్చిన డీప్ ఫేక్ వీడియో పట్ల అంతా ఎంతో అండగా నిలిచారు. వాళ్ళందరికీ ప్రేమతో కృతజ్ఞతలు చెబుతున్న.. ఆ టైంలో మీరు నాకు ఎంతో అండగా ర‌క్ష‌ణ‌క‌వ‌చంలా నిలిచారు. ఎవరి ఫోటో అయినా అనాధికారంగా ఉపయోగించడం అనేది చాలా పెద్ద తప్పు.. తాజా సంఘటన ఇలాంటి వీడియోలను సృష్టించే వారికి ఓ గుణపాఠం కావాలి అంటూ రాసుకొచ్చింది.

అది వారి జీవితాంతం గుర్తుండేలా ఉండాలి అంటూ రష్మిక మందన వివ‌రించింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇక గతంలో ఈమె డిప్ ఫేక్‌ వీడియో బారిన పడడంతో ఎంతోమంది సినీ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. మొద‌ట‌ బిగ్ బి అమితాబచ్చన్ ఈ వీడియో పై ఆవేదన వ్యక్తం చేశారు. త‌ర్వాత చాలా మంది ఆమెకు తొడ‌య్యారు. కాగా అరెస్టు అయిన ఆ వ్యక్తి గుంటూరులో పొట్టుపడ్డాడు. అతడి వయస్సు 24 ఏళ్ళని తెలుస్తుంది.