“ఏంటి ..ఆ సినిమాలో సమంత ఉందా..?”. అయితే నేను చేయను చేతులెత్తేసిన హీరో ప్రభాస్..!

ప్రభాస్ ..చాలా సైలెంట్ పర్సన్ ..తన పని తాను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ..అందరికీ ఇంతవరకే తెలుసు . కానీ ప్రభాస్ లో కూడా తెలియని నాటినెస్ ఉంది . సెటైర్స్ వేస్తాడు ..సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే ..వెరీ వెరీ జోవియల్ పర్సన్ అని.. చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంది . కాగా రీసెంట్గా ప్రభాస్ కి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ప్రభాస్ – వివి వినాయక్ చాలా చాలా మంచి ఫ్రెండ్స్ . జాన్ జిగిడి దోస్తులు అనే చెప్పాలి . మొన్నటికి మొన్న ఓ ఇంటర్వ్యూలో మీరు బాగా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే డైరెక్టర్స్ పేర్లు చెప్పమంటే అందులో ఒకరి పేరుగా వివి వినాయక్ పేరుని చెప్పుకొచ్చాడు ప్రభాస్ . ఆయన డైరెక్షన్లో ప్రభాస్ ఒక సినిమాలో నటించాల్సి ఉండింది . అయితే ఆ సినిమాను రిజెక్ట్ చేశాడు . ఆ సినిమా మరేదో కాదు “అల్లుడు శీను”.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటించింది. ఈ సినిమాలో మొదటగా హీరోగా ప్రభాస్ ని అనుకున్నారట . కానీ ఆయనకు కథ నచ్చక రిజెక్ట్ చేశారట . అంతేకాదు వివి వినాయక్ ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటిస్తుంది అంటూ ఊరించిన కూడా ప్రభాస్..” వామ్మో సమంత మేడమా..? నావల్ల కాదురా బాబు ..నేను అసలు చేయలేను “అంటూ సరదాగా కామెంట్స్ చేశారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!