“ఏవయ్యా చిరంజీవి.. ఆ మాత్రం తెలియదా..?”..స్టేజీ పై అడ్డంగా దొరికిపోయిన మెగాస్టార్..!!

కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు పొరపాటున తప్పు పలుకుతాము. చాలామంది స్టార్ సెలబ్రెటీలు స్టేజి పై తప్పు పేర్లు పలుకుతూ ఉంటారు . గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆయన సొంత సినిమా పేరుని మర్చిపోయి వేరే సినిమా పేరును చెప్పుకొస్తాడు . అయితే రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి సైతం అలా తప్పు పేరు పలికి సోషల్ మీడియాలో అడ్డంగా ట్రోలింగ్కి గురవుతున్నాడు . తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి .

ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకున్నారు. ఇదే మూమెంట్లో ట్రైలర్ చూసి చాలా షాక్ అయ్యానని .. అసలు ఈ సినిమాను తెరకెక్కించింది ఎవరా ..? అంటూ ఆరా తీస్తే సురేష్ వర్మ అంటూ బయటపడింది అంటూ టంగ్ స్లిప్పయ్యాడు . హనుమాన్ సినిమాను తెరకెక్కించింది ప్రశాంత్ వర్మ . ఆయన పొరపాటున సురేష్ వర్మ అన్నారు. అంతేకాదు మెగా హేటర్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . ఇంకా మేలు ఈ సినిమాను తెరకెక్కించింది ప్రశాంత్ నీల్ అనలేదు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

కాగా తేజా సజ్జ నటించిన హనుమాన్ సినిమా ఈ నెల 12న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఏకంగా 9 భాషల్లో తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. ఈసారి సంక్రాంతికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జ ‘హనుమాన్’, వెంకటేష్ ‘సైంధవ్‌’, నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. అయితే ఈ నాలుగు సినిమాల్లో హనుమాన్ చిత్రం మాత్రమే చిన్న హీరో సినిమా. దీంతో థియేటర్స్ కేటాయింపు దగ్గర ఒక వివాదం నెలకుంది.