సినీ ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండాలంటే అది చేయక తప్పదు మృణాల్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే గోల్డెన్ లాగ్ ఇమేజ్‌ని సొంతం చేసుకునే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో మృణాల్ ఠాకూర్‌ ఒకటి. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామమ్‌ మూవీ తో టాలీవుడ్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. ప్రిన్సెస్ నూర్జహాన్ గా, సీత మహాలక్ష్మి గా సాంప్రదాయపద్ధంగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత నాని హాయ్ నాన్న సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తోంది.

thakur: Mrunal Thakur reveals playing a cop was 'challenging' due to her  soft voice - The Economic Times

వరుస సినిమాలో నటించేయాలన్న ఆసక్తి కన్నా మంచి పాత్ర ఉన్న సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలంటే కచ్చితంగా గ్లామర్ మెయింటెన్ చేయక తప్పదని ఇమె వివ‌రించింది. ఇక గ్లామర్ విషయంలో ఆమె కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని వివరించింది. న్యాచురల్ బ్యూటీ టిప్స్ ను అంటే మొహానికి పసుపు రాసుకోవడం, తాజా పండ్లతో ఫేస్ ప్యాక్ చేసుకోవడం లాంటిది నేను చేస్తానని.. ఇక బియ్యం కడిగిన నీళ్లను కూడా ముఖంపై స్ప్రే చేసుకుంటారని ఇది ఒక కొరియన్ టిప్ అంటూ చెప్పుకొచ్చింది మృణాల్.

Telugu film 'Hi Nanna' rakes in Rs 6.10 crore on opening day - Thaiger World

2023లో కేన్స్ లో సందడి చేయడంతో నా డ్రీమ్ నెరవేరిందని వివరించింది. యాక్టర్‌గా ఆఫర్లు దక్కించుకోవడం చాలా కష్టమైన పని అని.. టాలెంట్ కు అదృష్టం కూడా కలిసి వస్తేనే ఎక్కడైనా రాణించగలమని మృణాల్ ఠాగూర్ వివరించింది. ఎన్ని సమస్యలు ఎదురైనా సంతోషంగా గడపాలని ఫిలాసఫీతోనే నేను ఈ స్టేజ్ లో ఉన్నానని.. ప్రేక్షకులకు నా పేరు గుర్తు లేకపోయినా నేను చేసిన పాత్రలు వాళ్ళ మదిలో మెదులుతూనే ఉంటాయని వివరించింది. రోజు పనికి వెళ్లాలని నేను ఇష్టపడే పనిని చేయాలని భావిస్తానంటూ చెప్పుకొచ్చింది. లుక్స్ కు, ఈవెంట్ కు అనుగుణంగా కొత్త ట్రెండ్స్ ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటానని, ట్రై చేస్తూ ఉంటానని మృణాల్ వివరించింది.

Family Star: First Single From Vijay Deverakonda–Mrunal Thakur's Film To Be  Out Soon! Makers Release Lead Pair's New Still on Diwali 2023 (View Pic) |  🎥 LatestLY