చిరంజీవి కాల్ చేసి అడిగిన ఒప్పుకోని దిల్ రాజు.. స్టేజీ పైనే అసలు నిజం బయట పెట్టిన మెగాస్టార్..!!

సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా వస్తే హీరోలను ఎంత తక్కువగా చూస్తారో.. ఎలా తొక్కేస్తారో అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గా మరోసారి అలాంటి వాళ్ళ ఆటలకు బలైపోయాడు తేజ . సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు పాత్రలో నటించిన తేజ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. తాజాగా ఆయన నటించిన సినిమా హనుమాన్ . జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం తేజ సజ్జ ప్రశాంత్ వర్మ చాలా కష్టపడ్డారు .

అయితే ఈ సినిమా కోసం థియేటర్స్ తక్కువగా కేటాయించడం గమనార్హం. దీని గురించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి . కాగా రీసెంట్గా హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సైతం తేజకు సపోర్ట్ చేశారు. ” తక్కువగా థియేటర్స్ ఇచ్చారని బాధపడొద్దు .. మీ సినిమాలో కంటెంట్ ఉంటే జనాలు ఎలా అయినా ఆదరిస్తారు” అంటూ సపోర్ట్ చేశారు . అంతేకాదు గతంలో సంక్రాంతి కానుకగా ఆయన నటించిన ఖైదీ నెంబర్ 150 బాలయ్య నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ అవుతున్న టైంలో శర్వానంద్ నటించిన శతమానం భవతి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కూడా.. ఇదే సిచువేషన్ నెకకొన్నిందట.

“అప్పుడు దిల్ రాజుకు నేను కాల్ చేసి మాట్లాడానని.. ఆయన ఒకటే చెప్పారని.. కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా జనాలు చూస్తారు సార్ .. మేము ఆ తేదీన మా సినిమాను రిలీజ్ చేస్తామంటూ స్ట్రాంగ్ గా మాట్లాడారట. ఆయన మాట ప్రకారమే శతమానం భవతి కూడా బాగా హిట్ అయిందని .. మనలో టాలెంట్ ఉండి జనాలకు కంటెంట్ నచ్చితే ఈరోజు కాకపోయినా రేపైనా సరే మన సినిమాను ఆదరిస్తారు అని చెప్పుకొచ్చారు”. దీంతో దిల్ రాజు పేరు మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. దిల్ రాజు అనుకుంటే ఏమైన చేస్తాడు అన్న మాటను చెప్పకనే చెప్పేశాడు చిరంజీవి..!!