” ప్రభాస్ అంటే ప్రభాసే.. అతనికి తిరుగులేదు “.. శివాజీ సెన్సేషనల్ కామెంట్స్..!

ప్రముఖ టాలీవుడ్ నటుడు శివాజీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసిన శివాజీ ప్రస్తుత కాలంలో పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో బిగ్ బాస్ అనే షో లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ షో నుంచి బయటికి వచ్చిన అనంతరం ఈయనకి సినిమా అవకాశాలు కూడా బానే వస్తున్నాయని చెప్పొచ్చు. ఇక ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీ.. వేణు స్వామి ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. శివాజీ మాట్లాడుతూ..” దర్శకుడు ఓంరౌత్ రామాయణాన్ని విభిన్నంగా చూపించాలని భావించా.

అయితే దర్శకుడు కొన్ని అంశాలకు సంబంధించి చేసిన తప్పుల వల్ల సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేకపోయింది. అలాగే రావణుని పాత్రకు సైఫ్ ఖాన్ పూర్తి న్యాయం చేయలేదు. అలాగే మొన్న ఈ మధ్యనే వేణు స్వామి గారు ప్రభాస్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు.. ప్రభాస్ అంటే ప్రభాసే. ప్రభాస్కు తిరుగులేదు ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శివాజీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.