మహేష్ ” గుంటూరు కారం ” ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ మాస్ మసాలా మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.


ఇక తాజాగా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం డేట్ లాక్ అయ్యింది. ఎప్పుడంటే.. రేపు సాయంత్రం 5 గంటల తరువాత గుంటూరులోని నంబూరు ఎక్స్ రోడ్స్ లో ఈ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ కి భారీ స్థాయిలో జనం వచ్చే అవకాశం కూడా ఉందని చిత్ర బృందం ప్రకటించింది. ఇక నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

యూట్యూబ్ లో అయితే ఏకంగా 25 మిలియన్స్ కి పైగా న్యూస్ రాబట్టింది. ఇక ఈ సినిమా రాజకీయ పరంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఈనెల 12న ప్రేక్షకులు ముందుకి రానుంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.