త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్న రష్మిక, విజయ్ దేవరకొండ.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఓ పుకారు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ నటించిన రెండు సినిమాలలో కూడా కెమిస్ట్రీ అద్భుతంగా పండించారు. దీంతో వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది.

ఇక అంతేకాకుండా వీళ్లిద్దరూ కలిసి ఒకే దగ్గర పండగలను సెలబ్రేట్ చేసుకోవడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. ఇక గత కొంతకాలంగా వీరి డేటింగ్ రూమర్స్ ద్వారా వార్తలో నిలుస్తూ ఉన్నారు. ఇక సీక్రెట్ గా రిలేషన్ మెయింటైన్ చేస్తున్న రష్మిక, విజయ్ దేవరకొండ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ తాజాగా ఓ వార్త వినిపిస్తుంది. వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.

ఇకపోతే ముందుగా వీరిద్దరూ నిశ్చితార్థం జరుపుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరి ప్రేమకి వీరి కుటుంబ సభ్యులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 2వ తేదీన వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నారట. ఇక అనంతరం మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.