స్పెషల్ వీడియోతో ..అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన మహేశ్ భార్య నమ్రత..ఎగిరి గంత్తేయాల్సిందే..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాకి సంబంధించిన టాక్ ఎక్కువగా వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఈసారి సంక్రాంతికి స్టార్ హీరోలు టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకుంటూ ఉండటం గమనార్హం. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ట్రైలర్ నిన్న రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో గుంటూరు కారం సినిమా ట్రైలర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది.

అంతేకాదు సుదర్శన్ థియేటర్ వద్ద గుంటూరు కారం సినిమాకి సంబంధించిన హంగామా ఎలా ఉందో మహేష్ బాబు భార్య నమ్రత వీడియో రూపంలో షేర్ చేసింది . ఈ వీడియోలో ఫుల్ డప్పులతో అరుపులతో కేకలతో మహేష్ బాబు అభిమానులు రచ్చ రంబోలా చేస్తున్నారు. “అంతేకాదు జనవరి 12న సుదర్శన్ థియేటర్లోని ఫ్యామిలీ అంతా కలిసి గుంటూరు కారం సినిమా చూడబోతున్నాం” అంటూ రాసుకు వచ్చింది .

దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . మొత్తానికి గుంటూరు కారం కి మహేష్ బాబు భార్య నమ్రత కూడా బాగానే ప్రమోట్ చేస్తుంది , చూద్దాం మరి ఫస్ట్ రోజు ఎలాంటి టాక్ దక్కించుకుంటుందో ఈ గుంటూరు కారం. ఈసారి సంక్రాంతికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జ ‘హనుమాన్’, వెంకటేష్ ‘సైంధవ్‌’, నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. అయితే ఈ నాలుగు సినిమాల్లో హనుమాన్ చిత్రం మాత్రమే చిన్న హీరో సినిమా. దీంతో థియేటర్స్ కేటాయింపు దగ్గర ఒక వివాదం నెలకుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)