టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ తాజాగా నటించిన సినిమా సలార్. ఈ సినిమా డిసెంబర్ 22న థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది . సంచలనాన్ని సృష్టించింది. బాహుబలి తర్వాత అలాంటి హిట్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ అభిమానులకు ఆకలి తీర్చేసింది ఈ సినిమా .
కాగా అలాంటి ప్రభాస్ నుంచి సంక్రాంతికి ఒక అప్డేట్ వచ్చింది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్ లో ప్రభాస్ చాలా నాటీగా ఉన్నాడు. బ్లాక్ షర్ట్ తో లుంగీ తో చాలా మాస్ మసాలా రేంజ్ లో కనిపిస్తున్నాడు . కాగా ఈ సినిమాను మొదటగా డైరెక్టర్ మారుతి నానికు వివరించారట . నాని ఈ సినిమా చేస్తే బాగుంటుంది అంటూ ఆశపడ్డారట .
కానీ కొన్ని కారణాల చేత నాని ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట . ఆ తర్వాత ఈ కథను చాలామంది హీరోల వద్దకు తీసుకెళ్లిన ఫైనల్లీ కొన్ని మార్పులు చేర్పులతో మన డార్లింగ్ ప్రభాస్ ఓకే చేశాడు . ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్ళింది . ఈ సినిమాల్లో ముగ్గురు హీరోయిన్ నటించబోతున్నారట . ఈ సినిమా అంతా ఒక థియేటర్ కి సంబంధించి రన్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇది ఫుల్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్క బోతుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!
“రాజా సాబ్” సినిమా ని మిస్ చేసుకున్న ఆ తెలుగు హీరో ఎవరో తెలుసా..? షాక్ అయిపోతారు..!!
