ఆ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ సెట్స్ కి వస్తే నేను సినిమా చేయను.. స్టార్ హీరో క్రేజీ కండిషన్..!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం . ఇది ఒక మాయా లోకం .. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు గెస్ చేయలేరు . అది నిజం.  కేవలం హీరో హీరోయిన్ల విషయాలలోనే కాదు డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ విషయాలలో కూడా ఇదే జరుగుతుంది. ప్రశాంత్ వర్మ రీసెంట్గా దాన్నే ప్రూవ్ చేశారు . బడా డైరెక్టర్ తో పోటీకి వెళ్లి ప్రశాంత్ వర్మ తన సత్తాను ప్రూవ్ చేసుకున్నాడు .

గుంటూరు కారం సినిమా కన్నా హనుమాన్ సినిమా నే బాగుంది అంటూ జనాలు బల్లగుద్ది చెప్తున్నారు అంటే దానికి కారణం ప్రశాంత్ వర్మ డైరెక్షన్ అని చెప్పాలి. కాగా ఇలాంటి మూమెంట్ లోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రశాంత్ వర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయ్. ప్రశాంత్ వర్మ దాదాపు 400 కధలను రాసుకున్నారట . చాలామంది ప్రొడ్యూసర్స్ కి వినిపించడానికి ట్రై చేశారట . ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదట .

ఆయనను అవహేళనగా చూశారట ..అవమానించారట.. ఒక ప్రొడ్యూసర్ అయితే వాచ్మెన్ కి కథ వినిపించమని చెప్పారట.. మరొక ప్రొడ్యూసర్ అర్థరాత్రి రెండు గంటలకు కాల్ చేసి మందు సీటింగ్ లో ఉన్నాను కథ వింటాను రా అంటూ చెప్పుకొచ్చే వారట.. ఇలా చాలా అవమానాలు భరించిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అంతేకాదు ఆయన కెరియర్ లో మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ కి ఎండ్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయట. అంతేకాదు కొంతమంది హీరోలు హీరోయిన్ బాయ్ ఫ్రెండ్స్ సెట్స్  కి వస్తే మేము చేయము అంటూ కూడా కండిషన్స్ పెడతారట. ఈ విషయాలను ఓపెన్ గా చెప్పి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాడు ప్రశాంత్ వర్మ..!!