గుంటూరు కారం సినిమా అట్టర్ ఫ్లాప్.. దిల్ రాజు రియాక్షన్ ఇదే..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే గుంటూరు కారం పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.  టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన సినిమానే ఈ గుంటూరు కారం. తనదైన స్టైల్ లో నటించిన మహేష్ బాబు ఈ సినిమాలో విజృంభించేశాడు. మాస్ డైలాగ్స్ తో చెదరేగిపోయాడు.  శ్రీ లీల అందం శ్రీ లీల డాన్స్ ఈ సినిమాకి మరింత హైలెట్గా నిలిచాయి.  అయినా సరే త్రివిక్రమ్ డైరెక్షన్ పాత చింతకాయ పచ్చడిలానే ఉంది అంటూ కొందరు కొట్టి పడేశారు.

ఈ సినిమాకి అట్టర్ ప్లాప్ టాక్ ని క్రియేట్ చేశారు . అయితే గుంటూరు కారం ఫ్లాప్ అంటూ సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్లింగ్స్ పై ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పందించారు . ఆయన మాట్లాడుతూ ..”మనం ఒక సినిమా బాగోలేదు బాగోలేదు అంటూ థియేటర్ కి వెళ్తే ఖచ్చితంగా ఆ సినిమా మనకి నచ్చదు ..ఆ సినిమా బాగుంది అంటూ మనం థియేటర్ కి వెళ్తే ఎవరు ఎన్ని చెప్పినా అది మనకు నచ్చుతుంది . అయినా నేను చాలా మందిని పర్సనల్గా కనుక్కున్నాను సినిమా చాలా బాగుంది “అంటూ చెప్పుకొస్తున్నారు.

“మరి ఎందుకు సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ని వేలెత్తి చూపించి ట్రోల్ చేస్తున్నారో నాకు తెలియదు . కలెక్షన్స్ పరంగా కూడా ముందుకు వెళ్తుంది . సినిమా బాగోలేకపోతే ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావు కదా..?? ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఇంతకంటే నేనేం చెప్పలేను “అన్న స్థాయిలో ఇచ్చిపడేశారు.  ప్రెసెంట్ దిల్ రాజు మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి..!!