గుంటూరు కారం లో పూజ తర్వాత ఆ హీరోయిన్ చూస్ చేసుకున్నారా..? సడన్గా ట్రాక్ లోకి శ్రీలీలను రప్పించింది ఎవరో తెలుసా..?

గుంటూరు కారం .. టాలీవుడ్ ఇండస్ట్రీలో  సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు నటించిన మూవీ . గుంటూరు కారం సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్ట్ చేశాడు.  ఈ సినిమాలో మీనాక్షి చౌదరి – శ్రీ లీల హీరోయిన్లుగా నటించారు.  అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డేను అనుకున్నారు . కానీ ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఆమెను తీసేసి ఆమె ప్లేసులో శ్రీ లీలా ని పెట్టుకున్నారు .

అయితే పూజ హెగ్డే తర్వాత శ్రీ లీలా కన్నా ముందు ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నాను చూస్ చేసుకున్నారట మేకర్స్ . అయితే రష్మిక ఈ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేసిందట . ఆ కారణంగానే శ్రీలీల చేతికి ఈ ఆఫర్ వచ్చిందట.  ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీలీల ఈ సినిమాలో నటించడం ద్వారా డాన్స్ బాగా వేయగలరు అని ప్రూవ్ చేసుకున్నింది  తప్పిస్తే మరి ఏమి ఒరిగింది లేదు అంటున్నారు శ్రీ లీల అభిమానులు.

కాగా భారి అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది.  కొంతమంది ఈ సినిమా పై నెగిటివ్ ప్రచారం చేస్తున్న సరే ఈ సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం కుమ్మి పడేసింది . 170 కోట్లు క్రాస్ చేసి మహేష్ బాబు కెరియర్ లో సంచలన రికార్డును క్రియేట్ చేసి పెట్టింది..!!