ఇప్పుడు ఎక్కడ చూసినా సరే గుంటూరు కారం పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన సినిమానే ఈ గుంటూరు కారం. తనదైన స్టైల్ లో నటించిన మహేష్ బాబు ఈ సినిమాలో విజృంభించేశాడు. మాస్ డైలాగ్స్ తో చెదరేగిపోయాడు. శ్రీ లీల అందం శ్రీ లీల డాన్స్ ఈ సినిమాకి మరింత హైలెట్గా నిలిచాయి. అయినా సరే త్రివిక్రమ్ డైరెక్షన్ పాత చింతకాయ పచ్చడిలానే ఉంది అంటూ కొందరు కొట్టి పడేశారు.
ఈ సినిమాకి అట్టర్ ప్లాప్ టాక్ ని క్రియేట్ చేశారు . అయితే గుంటూరు కారం ఫ్లాప్ అంటూ సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్లింగ్స్ పై ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పందించారు . ఆయన మాట్లాడుతూ ..”మనం ఒక సినిమా బాగోలేదు బాగోలేదు అంటూ థియేటర్ కి వెళ్తే ఖచ్చితంగా ఆ సినిమా మనకి నచ్చదు ..ఆ సినిమా బాగుంది అంటూ మనం థియేటర్ కి వెళ్తే ఎవరు ఎన్ని చెప్పినా అది మనకు నచ్చుతుంది . అయినా నేను చాలా మందిని పర్సనల్గా కనుక్కున్నాను సినిమా చాలా బాగుంది “అంటూ చెప్పుకొస్తున్నారు.
“మరి ఎందుకు సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ని వేలెత్తి చూపించి ట్రోల్ చేస్తున్నారో నాకు తెలియదు . కలెక్షన్స్ పరంగా కూడా ముందుకు వెళ్తుంది . సినిమా బాగోలేకపోతే ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావు కదా..?? ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఇంతకంటే నేనేం చెప్పలేను “అన్న స్థాయిలో ఇచ్చిపడేశారు. ప్రెసెంట్ దిల్ రాజు మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి..!!
గుంటూరు కారం సినిమా అట్టర్ ఫ్లాప్.. దిల్ రాజు రియాక్షన్ ఇదే..!
