అమ్మ-నాన్న-పెళ్లాం లేకపోయిన పర్లేదు.. నాగచైతన్యకు ఆ ఒక్కటి ఉంటే 100 న్యూ ఇయర్ లకు సమానం..!

సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ ని పోగడడం కన్నా తిట్టడం ..ట్రోల్ చేయడమే ఎక్కువగా చేతున్నారు జనాలు. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న హీరోలను సైతం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.. ఇక ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న వాళ్లను ట్రోల్ చేయడం ఒక లెక్క అంటూ జనాలు కూడా ట్రోలింగ్ విషయాలను చాలా లైట్ గా తీసుకుంటున్నారు .

రీసెంట్గా అక్కినేని హీరో నాగచైతన్యను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న మీమ్స్ వైరల్ గా మారాయి . ప్రెసెంట్ “తండేల్” సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న నాగచైతన్య ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు . ఈ ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఏ కాదు తన పర్సనల్ విషయాలను కూడా ఓపెన్ గా చెప్పుకు వచ్చారు. మరి ముఖ్యంగా తన ఫేవరెట్ ఫుడ్ విషయం బయట పెట్టారు .

అందరిలాగా ఫారిన్ ఫుడ్స్ అంటే ఇష్టం అని చెప్పకుండా.. ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ అన్నం – పప్పు – ఆవకాయ్ – నెయ్యి – పచ్చి పులుసు కలుపుకొని తినడం అంటే చాలా ఇష్టమని పక్కన నంచుకోవడానికి మటన్ ఫ్రై – రొయ్యల ఫ్రై ఉంటే నా స్వామి రంగా ఇక లైఫ్ కి ఏం కావాలి అంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ చేశారు . ఈ కామెంట్స్ చాలా పాజిటివ్ గానే ఉన్నప్పటికీ నాగచైతన్య యాంటీ ఫ్యాన్స్ కావాలని ట్రోల్ చేస్తున్నారు. మీకు అవి ఉంటే చాలు ..అమ్మ – నాన్న 0 భార్య పిల్లలు ఎవరు అవసరం లేదు కదా అంటూ సోషల్ మీడియాలో హీరో అక్కినేని నాగచైతన్యను కావాలనే ట్రోల్ చేస్తున్నారు. ఆయన మాట్లాడిన పాజిటివ్ మాటలను కూడా నెగిటివ్గా ట్రెండ్ చేస్తున్నారు.