ప్రెసెంట్ టాలీవుడ్ నెం 1 హీరోయిన్ ఎవరో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు..!

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు అనేది ప్రశ్నార్థకంగా .. అలాగే ఇంట్రెస్ట్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు . ఒక్కొక్క హీరోయిన్ కి ఒక్కొక్క రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . అయితే ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఉన్న బ్యూటీస్ లో టాప్ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. కాగా అభిమానుల లెక్కల ప్రకారం టాప్ హీరోయిన్ అంటే ఒకప్పుడు సమంత – నయనతార ఉండేవాళ్లు .

ఇప్పుడు మాత్రం రష్మిక మందన్నా – శ్రీ లీల మారిపోయారు. శ్రీ లీల సినిమాలు ఫ్లాప్ అవుతున్న సరే ఆమెతోనే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్ .. జనాలు కూడా ఆమె అందాలకు దాసోహం అయిపోయారు . దీంతో సోషల్ మీడియాలో శ్రీ లీల హవా కొనసాగుతుంది. అలాగే ఇండస్ట్రీలోనూ నెంబర్ 1 స్థానాన్ని అందుకుంది . ఆ తర్వాత స్థానంలో రష్మిక మందన్నా సరిపెట్టుకునింది.

శ్రీ లీల చేతిలో పది సినిమాలతో బిజీగా ఉంటే రష్మిక ఐదు సినిమాలతో దూసుకుపోతుంది . ఇలా ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ముందుకు వెళ్తున్నారు. మృణాల్ ఠాకూర్ కూడా వీళ్లకు గట్టి కాంపిటీషన్ ఇవ్వడానికి సిద్ధపడుతుంది. ఇక తమన్నా, కీర్తి సురేష్, సమంత వాళ్ల నెంబర్ ఎక్కడొ ఉంది. జనాలు వాళ్లను పట్టించుకోవడం లేదు..!!