చాలా ఏళ్ళ తరువాత దేవర కోసం అలాంటి పని చేసిన ఎన్టీఆర్.. శభాష్ రా నందమూరి అబ్బాయ్..!

దేవర .. టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . ఆచార్య లాంటి బిగ్ డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్ .

స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతో అద్భుతంగా బాగా ఆకట్టుకునింది . అంతే కాదు దేవర అంతా కూడా నైట్ మోడ్ లోనే షూట్ చేసినట్లు తెలుస్తుంది . అంతేకాకుండా జాన్వి కపూర్ కి సంబంధించిన లుక్ రిలీజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ కూడా నైట్ మోడ్ లోనే తీసినట్లు తెలుస్తుంది . ఈ రెండిటిని బేస్ చేసుకొని ఈ సినిమా అంతా రాత్రిపూటనే చూపించబోతున్నారేమో అంటున్నారు ఫాన్స్ . అంతేకాదు ఈ మధ్యకాలంలో మనం ఎన్టీఆర్ ని లుంగీ కట్టి చూడలేదు .

చాలా ఏళ్ళే అవుతుంది . ఫ్యాన్స్ కి ఆ కోరిక కూడా తీర్చేసాడు కొరటాల శివ . ఈ సినిమాల్లో లుంగీకటి ఫాన్స్ కు ఓ రేంజ్ లో గూస్ బంప్స్ వచ్చేలా డైలాగ్స్ చెప్పాడు. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది. ఈ సినిమా ఏప్రిల్ 5 , 2024 న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సాయి పల్లవి సెలక్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది..!!