హాస్య బ్రహ్మీ.. బ్రహ్మానందం మొదటి సంపాదన మ‌రీ అంత త‌క్కువా.. అస‌లు ఊహించ‌లేరు..?

టాలీవుడ్ స్టార్ కమెడియన్ నవ్వుల బ్రహ్మీ బ్రహ్మానందం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో వందల సినిమాల్లో కమీడియన్ గా కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుని.. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ సంపాదించుకున్నాడు బ్రహ్మానందం. దాదాపు 1,000 పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాలను తగ్గించేశాడు. ఇక సినిమాలకు దూరంగా ఉంటున్న బ్రహ్మీ ఎక్కువ సమయాన్ని కుటుంబంతో గడుపటానికి ఇష్టపడతారు. బ్రహ్మానందం సినిమాల్లోకి రాకముందు తెలుగు లెక్చరర్ గా పనిచేసిన సంగతి చాలామందికి తెలుసు.

అయితే ఇప్పుడు ఆయన తన తెలుగు పదాలన్నింటినీ కూడా తన ఆత్మకథ రూపంలో ఒక పుస్తకంగా రూపొందించాడు. ఆ పుస్తకానికి నేను మీ బ్రహ్మానందం అనే పేరుతో తాజాగా పబ్లిష్ చేశారు. ఈ పుస్తకంలో ఆయన పుట్టినప్పటినుంచి తనకి ఎదురైన కష్టాలు, ఇబ్బందులు తన చదువు కోసం పడిన శ్రమ అన్నింటిని కూడా క్లుప్తంగా వర్ణించాడు. తన కుటుంబంలో ఎవరు చదువుకోలేదని.. తను మాత్రమే చదువుకున్నాను అని చెప్పుకొచ్చిన బ్రహ్మానందం.. నేను బాగా చదవడంతో నా చదువుకు చాలామంది సహాయం చేశారని వివరించాడు.

అలా బిఏ వరకు పూర్తి చేసిన నేను ఎం ఏ చదవడానికి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్లాను.. ఆ సమయంలో నా చదువుకి, నా ఖర్చులకు చాలా ఇబ్బందిగా మారింది. దాంతో ఏదైనా పనిచేసుకుంటూ.. చదువుకోవాలని భావించా అంటూ బ్రహ్మానందం రాసుకొచ్చాడు. ఇలా కాలేజీ వెళ్తున్నటువంటి దారిలో లారీ మెకానిక్ షాప్ కనిపించిందని.. అక్కడ మెకానిక్ పనులు చేయడమే కాకుండా.. లారీలకు పెయింటింగ్ కూడా వేశానని వివరించాడు. అయితే అక్కడికి వెళ్లి ఏదైనా పని కావాలని అడిగినప్పుడు.. బ్రహ్మానందంని వారి సహాయకుడిగా చేర్చుకున్నారని.. రెండు సంవత్సరాలు పాటు పనిచేస్తూ లారీలకు పెయింటింగ్ వేసానని వివరించాడు.

అప్పట్లో నెలకి ఇంత జీతం అని డబ్బు ఇచ్చే వాళ్ళు కాదు.. నేను ఆరోజు ఎంత పని చేస్తే అంత డబ్బు వచ్చేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాలేజీకి వెళ్లడం సాయంత్రం పనికి వెళ్లడం చేసేవాడిన్ని.. అప్పట్లో నాకు నాలుగు నుంచి ఐదు రూపాయలు వరకు డబ్బు ఇచ్చే వారిని.. అదే తన మొదటి సంపాదన అంటూ బ్రహ్మానందం వివరించారు. అప్పట్లో ఆ డబ్బు అంటే చాలా ఎక్కువ‌. రెండు సంవత్సరాలు చ‌దువుపూర్తి చేసి చదువు అయిపోయిన వెంటనే లెక్చరుగా మారాను అంటూ చదువు కోసం తన పడిన కష్టం గురించి బ్రహ్మీ వివరించాడు.