58 ఏళ్ల వయసులో అలాంటి పనిచేస్తున్న స్టార్ హీరో.. ఈ ఏజ్ లో అవసరమా అంటూ..

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ ఈ పేరుకు టాలీవుడ్ లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దంగల్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించాడు అమీర్‌ఖాన్‌. బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎన్నో హిట్ సినిమాలు నటించి మెప్పించాడు. ఇక చివరిగా అమెరికా లాల్ సింగ్ చేద్దా సినిమాలో నటించినా.. ఈ సినిమా ప్లాప్ అయింది.

దీంతో ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అమీర్‌ఖాన్ షూటింగ్ బ్రేక్ ఇచ్చి మరి ఖాళీ సమయంలో కొత్త విషయాలపై ఆసక్తి చూప్తున్నాడు. ఇందులో భాగంగానే అమీర్ ఖాన్ శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంటున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్‌ అవుతున్నాయి. దీంతో అందరూ షాక్ అవుతున్నారు.

58 ఏళ్ల వయసు వచ్చిన అమీర్ ఖాన్ ఇప్పుడు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకొని ఏం చేస్తాడు.. ఇంత ఉత్సాహంతో ప్రాక్టీస్ చేస్తున్నాడు ఈ ఏజ్ లో ఈయన శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాటానికి కార‌ణం ఏంటో.. తన నెక్స్ట్‌ సినిమా కోసమే ఈ క్లాసికల్ మ్యూజిక్ ఏమైనా నేర్చుకుంటున్నాడా అంటూ ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది ఈ ఏజ్ లో నీకు ఈ మ్యూజిక్ క్లాస్‌ల చుట్టు తిర‌గ‌ట్ అవసరమా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.