ఆమె ఓ ఐటమ్ గర్ల్.. జాన్వి కపూర్ పరువు తీసేసిన ఆ స్టార్ డైరెక్టర్..

దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన‌ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మత్తెక్కించే కళ్ళతో కొర్ర కారు మనసులు దోచేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమాలపరంగా ఇప్పటివరకు ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాకపోయినా.. ఎక్స్పోజింగ్, ఫోటోషూట్స్ నుంచి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన సోషల్ మీడియాలో ఏ ఫోటో షేర్ చేసిన మిలియన్ కొద్దిగా వ్యూస్, లైక్‌ల‌తో దూసుకుపోతుంది జాన్వి.

 

ఇక తాజాగా జాన్వి కపూర్ కు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ డైరెక్టర్ జాన్వి పై గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అసలు విషయం ఏంటంటే జాన్వి టాలీవుడ్ ఎంట్రీ కోసం.. ఓ స్టార్ డైరెక్టర్ ను కలిసాడట బోనీకపూర్. స్టార్ డైరెక్టర్ కు జాన్వి ఫోటోను చూపించి అవకాశం ఇవ్వమని అడగగా.. జాన్వి ఫోటో చూస్తున్న డైరెక్టర్ ఈమె హీరోయిన్ కాదు.. ఐటెం గర్ల్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడట. దీంతో షాక్ అయినా బోనీకపు డైరెక్టర్ పై ఫైర్ అయ్యి అక్కడ నుంచి వెళ్లిపోయాడట.

 

ఇక ప్రస్తుతం జాన్వీ కపూర్ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌తోనే తన మొదటి తెలుగు సినిమా అవకాశాన్ని కొట్టేసింది. అచ్చం శ్రీదేవి లుక్స్ తో ఆకట్టుకునే జాన్వి.. కొరటాల డైరెక్షన్లో దేవర సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన భోనీకపూర్.. జాన్వి శ్రీదేవి ప్రతిరూపమని.. తన తల్లి నటనతో ఈక్వల్ గా జాన్వి నటిస్తుందని.. ఆ డైరెక్టర్ పై పరోక్షంగా మండిపడినట్లు నెట్టింట వార్తలు తెగ వినిపిస్తున్నాయి.