ఎన్టీఆర్ చిన్నోడు పెద్ద కంచు.. ఎయిర్ పోర్ట్ లో మీడియాని చూడగానే ఏం చేశాడో చూడండి..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా గాని జూనియర్ ఎన్టీఆర్ అన్న పేరు వింటే తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేస్తాయి . మనకి తెలియకుండానే ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఆయనతో ఏర్పడిపోతుంది . ఓ హీరో అనడం కన్నా కూడా మన ఇంటి బిడ్డ పెద్ద కొడుకు మన పెద్ద అన్న అని చెప్పుకోవడం చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది . అలాగే ఎన్టీఆర్ కూడా తన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్స్ లో ఫ్యాన్స్ సేఫ్టీ గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు .

కాగా రీసెంట్గా దేవర సినిమాలో నటిస్తున్న ఈయన షూటింగ్ కి బ్రేక్ చెప్పి మరి తన ఫ్యామిలీతో వెకేషన్ ని ఎంజాయ్ చేయడానికి జపాన్ వెళ్ళాడు . ఆయన జపాన్ వెళ్లడానికి ఎయిర్ పోర్ట్ కి వచ్చిన పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి . అయితే ఎప్పటిలాగే ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు . అంతేకాదు తన పెద్ద బిడ్డ చిన్న బిడ్డతో కలిసి నడుస్తున్న పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి.

అయితే తారక్ పెద్దకొడుకు చాలా సైలెంట్ గా ఉన్న చిన్న కొడుకు మాత్రం పెద్ద కంచు . ఎయిర్ పోర్ట్ లో రచ్చ రంబోలా చేశాడు . వాళ్ళ నాన్న చేతులు పట్టుకున్న కూడా వదిలేసి ఒక్కడే వెళ్లాలి అంటూ గోల చేయడం ..మీడియాను చూసి ఏమాత్రం భయపడకుండా అల్లరి చేయడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఎన్టీఆర్ చిన్న కొడుకు పెద్ద కంచు అంటూ నాటీ కామెంట్స్ చేస్తున్నారు నందమూరి అభిమానులు..!!