యానిమల్ ఫస్ట్ డే కలెక్షన్స్ : ఆ రికార్డులను తుక్కు తుక్కు చేసేసిందిగా.. మొత్తం ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అంటే..!

కల్ట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సందీప్ రెడ్డివంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా యానిమల్ . అర్జున్ రెడ్డి సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ఆయన తెరకెక్కించిన యానిమల్ సినిమా నిన్న బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యి..సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకోవడమే కాకుండా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా సినీ చరిత్రను తిరగరాసింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు రన్ టైం ఎక్కువగా ఉంది .

జనాలను ఆకట్టుకుంటారో లేదో ..? అంటూ చాలా రివ్యూస్ వచ్చాయి . కానీ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా కేర్ఫుల్ గా ఆహ్లాదకరంగా ఎంటర్టైనింగ్ ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించాడు సందీప్ అంటూ సినిమా చూసిన జనాలు చెప్తున్నారు. అంతేకాదు మొదటి రోజు ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందా ..? అంటూ జనాలు ఈగర్ గా వెయిట్ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం యానిమల్ సినిమా వరల్డ్ వైడ్ ఫస్ట్ డే 102 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అమెరికాలో సైతం ఈ సినిమా సూపర్ డూపర్ టాక్ సంపాదించుకుంది. కేవలం భారత దేశంలోనే 75 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు రాబట్టిందట. ఇక వీక్ అంతా ఇదే హవా కొనసాగిస్తే వీకెండ్ లో మాత్రం కచ్చితంగా 350 కోట్ల నుంచి 400 కోట్లు దాటేయొచ్చు అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి . దీంతో అర్జున్ రెడ్డి సినిమాను బ్రేక్ చేసిన రికార్డ్ క్రియేట్ చేసింది యానిమల్ . చూడాలి ఇంకెన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో ఈ యానిమల్..?