ఇప్పటికే 20 సార్లు పెళ్లి చేసుకున్నా.. నటి కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ నటి అవికా గోర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్నారి పెళ్ళికూతురు సీరియల్‌తో బుల్లి తన ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయింది. తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ప్ర‌స్తుతం వధువు అనే వెబ్ సిరీస్‌తో మ‌ళ్ళి ప్రేక్ష‌కుల ముందుకిరానుంది. నందు, అవికా గోర్‌, అలీరెజా కీలక పాత్రలు నటించిన ఈ వెబ్ సిరీస్ పోలూరు కృష్ణ దర్శకత్వంలో.. శ్రీకాంత్ మెహతా, మహేంద్ర సోనీ ప్రొడ్యూసర్ గా తెర‌కెక్కుతుంది.

जब अविका गौर से फैन ने कहा- परिवार संग बालिका वधू देखने में आती है शर्म - Avika Gor reveals his fan said he ashamed watching balika vadhu with family tmov - AajTak

ఇక ఈనెల 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వధువు స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో అవికా గోర్ మాట్లాడుతూ వెబ్ సిరీస్ కు, పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ మొదలుకొని ఇప్పటివరకు నేను ఆన్ స్క్రీన్ పై కనీసం 20 సార్లు పెళ్లి చేసుకుని ఉంటా.. అయితే ఇది నాకు ఎప్పుడు బోర్ కొట్టదు. పెళ్లికూతురులా ముస్తాబవడం నాకు చాలా ఇష్టం.. మరోసారి వధువులో అలా ముస్తాబై కనిపించాను.

Pin on celebrities

థ్రిల్లర్ జానెర్ లో తెరకెక్కిన ఈ సిరీస్ ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగుతుంది అంటూ హీరోయిన్ అవికా గోర్ చెప్పుకొచ్చింది. బెంగాల్ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ఇందూ.. ను తెలుగులో వధువు గా తీసుకొస్తున్నం. ఇలాంటి స్క్రిప్ట్ నేను ఇప్పటివరకు యాక్ట్ చేయలేదు. నాకు టీవీ సీరియల్‌లో నటించిన ఎక్స్పీరియన్స్ ఉంది. బుల్లితెర ప్రేక్షకులకు ఎలాంటి కంటెంట్ నచ్చుతుందో అలాంటి కంటెంట్ కచ్చితంగా వధువులో ఉంటుంది అంటూ వివ‌రించింది.

rediff.com: Meet Avika Gor of Balika Vadhu

ఇక చిన్నప్పుడే నటిగా మారడం వల్ల నా పర్సనల్ లైఫ్‌కు టైం స్పెండ్ చేయలేకపోయాను. న‌టిగా నేను ప్రతిరోజు ఒక కొత్త పాత్రలో కనిపించగలుగుతున్న.. ప్రతిరోజు ఒక కొత్త లైఫ్ చూస్తున్న.. నిర్మాతగా ఫ్లాప్‌ సినిమా తీయడం నాకు చాలా గర్వంగా అనిపించింది. ఇక పొల్యూషన్ కి వస్తే ఎలాంటి హంగామా లేకుండా మా ఇరు కుటుంబాల సమక్షంలో సింపుల్‌గా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.. ప్రస్తుతం తెలుగులో ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్న. హిందీలో పలు ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న అంటూ చెప్పుకొచ్చింది.