నిజమైన వేశ్య గృహంలో 15 రోజులు గడిపిన మృణాల్ ఠాగూర్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె దుల్క‌ర్ స‌ల్మ‌న్ నటించిన సీతారామమ్‌ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి పాపులారిటి దక్కించుకుంది. ఓ పక్క ప్రిన్సెస్ నూర్జహాన్ గా, మరోపక్క సీతా మహాలక్ష్మి గా నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అచ్చ తెలుగు ఆడపిల్లల చీరకట్టు, సాంప్రదాయంతో కోట్లాదిమంది ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మొదట బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది.

బాలీవుడ్ లో నటించిన సినిమాలు ఏవి ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాకపోవడంతో టాలీవుడ్‌కి అడుగు పెట్టింది. ఇక టాలీవుడ్ లో నటించిన‌ మొదటి సినిమానే మంచి సక్సెస్ రావడంతో ఈమెకు ఇక్క‌డ‌ మంచి ఇమేజ్ ఏర్పడింది. ఇక బాలీవుడ్‌లో మృణాల్‌ లవ్ సోనియా సినిమాలో వేశ్య‌ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్రకు 100% న్యాయం చేయాలని ఉద్దేశంతో నిజంగానే మృణాల్ వేశ్య‌ గృహానికి వెళ్లి అక్కడ 15 రోజులు గడిపిందట. చాలా దగ్గర నుంచి వారిని అబ్జర్వ్ చేసిందట. అయితే ఈ సినిమాలో కూడా ఆమె తన క్యారెక్టర్లు బాగా పండించింది.

అయినప్పటికీ.. ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినిమా సక్సెస్ అయిన.. కాకపోయినా.. మృణాల్ డెడికేషన్ చాలా బాగుంటుంది అంటూ.. తన నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ.. నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవ‌ల మృణాల్ న్యాచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న సినిమాలో నటించి మరో బ్లాక్ బస్టర్ త‌న ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్‌లో హీరోయిన్గా నటిస్తుంది.