ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అలాంటి రికార్డ్స్ సొంతం చేసుకున్న ఏకైక హీరో ప్రభాస్.. ఇదిగో ప్రూఫ్..

పాన్ ఇండియ‌న్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన మూవీ స‌లార్ మొద‌టి ఏకంగా రూ.178.7 కోట్ల గ్రాస్ వ‌శూళ‌ను కొల్లగొట్టి 2023 లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఇప్పటివరకు మొదటి రోజు ఈ రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్లు ఏ సినిమాకు రాలేదు. విజయ్ నటించిన లియో మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 146.15 కోట్ల వసూళ్లతో హైయెస్ట్ గ్రాసర్‌గా ఉంది. స‌లార్ దెబ్బ‌తో ఈ మూబీ 2వ ప్లేస్‌కు వెళ్ళింది.

ఇక ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్‌ సినిమా రూ.137 కోట్లకు గ్రాస్‌తో మూడోవ‌ స్థానంలో, షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా మొదటి రోజు రూ.126 కోట్ల గ్రాస్ వ‌శూళ‌తో నాలుగోవ‌ స్థానంలో, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో, రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ మూవీ మొదటి రోజు రూ.115.60 కోట్ల గ్రాస్ వ‌శూళ‌ను కొలగట్టి 5వ స్థానంలో, షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ మొదటి రోజు రూ.105 కోట్ల గ్రాస్ కొల‌గొట్టి 6వ స్థానంలో ఉన్నాయి.

సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 ఫ్రాన్చైజ్‌ మూవీ మొదటి రోజు రూ.94 కోట్ల గ్రాస్ వ‌శూళ‌ను కొల్లగొట్టి 7వ స్థానంలో నిలిచాయి. ఇలా అప్పటి వరకు అత్యధిక గ్రాస్ వ‌శూళ‌ను కొల్లగొట్టిన అన్ని సినిమాల.. ఫస్ట్ రోజు కలెక్షన్ రికార్డులను సలార్ బ్రేక్ చేసింది. దీంతో భారతదేశంలోనే మొట్టమొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టిన ఏకైక సినిమాగా సలార్‌ రికార్డులోకి ఎక్కింది. కేవలం ప్రభాస్‌కు మాత్రమే ఈ రికార్డ్స్ సాధ్యమైంది. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.