ప్రశాంత్ నీల్ డార్క్ విజువల్ టోన్‌లో సినిమాలు తీయడానికి కారణం అదేనా..?

కే జి ఎఫ్ సిరీస్ లతో ఇండస్ట్రియల్ బ్లాక్ బస్టర్ హిట్‌లు ఖాతాలో వేసుకున్నాడు ప్రశాంత్ నీల్‌. ఇక తాజాగా స‌లార్ సీజ్ ఫైర్ ప్రేక్ష‌కుల‌ముందుకు తీసుకోవచ్చాడు. ఇక ప్రభాస్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రశాంత్ నీల్‌ ఇప్పటివరకు తెర‌కెక్కించిన అన్ని సినిమాలు డార్క్ విజువల్స్ తోనే కనిపించాయి. దానికి కారణం ఏంటో ప్రశాంత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం.

yash: KGF-2 star Yash to announce his upcoming movie on April 14; Know more  here - The Economic Times

తన మూవీస్ లో డార్క్ కలర్ టోన్ వైపు మగ్గు చూపడానికి తనకు ఉన్న OCDనే కారణమని చెప్పుకొచ్చాడు. ఆయనకు ఎక్కువగా రంగు బట్టలు వేసుకోవడం నచ్చదని.. అలాగే నా ప్ర‌వృతిని మ‌ట్టి కలర్ రిప్రజెంటేషన్ తో నేను సినిమా చేయడానికి ఆసక్తి చూపలేదని.. ప్రశాంత్ నీలో చెప్పుకొచ్చాడు. ఇక ఈ డార్క్ విజువల్ టోన్ తెరపై నా వ్యక్తిత్వాన్ని రిప్రజెంట్ చేసేలా ఉంటుందని నేను భావిస్తున్నా అంటూ ప్రశాంత్ నీల్ వివరించాడు. ఇక సలార్‌, కేజీఎఫ్ మధ్య పోలికల గురించి మాట్లాడుతూ పోలిక ఉన్న కానీ ఇది సరైన ఎంపిక అంటూ వివ‌రించాడు.

Salaar: Cease Fire - Part 1 (2023) - Movie | Reviews, Cast & Release Date -  BookMyShow

ఇక సలార్ స్టోరీ సిరీస్ డ్రామాటిక్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంటుందని.. అందుకే తెరపై బ్లర్డ్‌.. డార్క్ విజువల్స్ వాతావరణాన్ని కోరుకుంటుందని.. చెప్పుకొచ్చాడు. కేజీఎఫ్ లో నేను చేసిన దాన్ని కొంచెం రిపీట్ చేయడం ప్రారంభించాను.. కానీ అది సలార్ డ్రామా కి సరిగ్గా కుదిరింది.. అందుకే నేను దాన్ని ఫిక్స్ అయిపోయా.. ఇతరులు ఏమనుకుంటారు, ఇతరులు ఏం కామెంట్స్ చేస్తారు అనే కారణంతో నేను దాన్ని మార్చుకోలేను.. ఇక స్టోరీ నా మెంటల్ స్టేటస్ కి అనుగుణంగా రూపొందుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.