” నేను ఆ డైరెక్టర్ లాగా సినిమా హైప్‌ కోసం చీప్ ట్రిప్స్ వాడను “… ప్రశాంత్ నీల్ సెన్సేషనల్ కామెంట్స్…!

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మనందరికీ సుపరిచితమే. తాజాగా ఈయన తెరకెక్కించిన మూవీ ” సలార్ “. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించిన… శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఇక నేడు రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ లో కూడా భారీ రికార్డుని నెలకొల్పింది. ఈ సినిమా కనుక మంచి ట్రాక్స్ సొంతం చేసుకుంటే కనుక తమిళ్, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి స్థాయిలో ఆదరణ లభిస్తుందని చెప్పొచ్చు.

ఇక ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి ట్రైలర్ సినిమాపై భారీ హైప్స్, నెలకొల్పింది. ఈ మూవీ కేజిఎఫ్ సినిమాతో పోలి ఉంటుందని గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వార్తలపై ప్రశాంత్ నీల్ స్పందిస్తూ కేజిఎఫ్ కి ఈ సినిమాకి ఏ మాత్రం లింక్ ఉండదని తెలిపాడు.

కేవలం టేకింగ్ మాత్రం కేజిఎఫ్ సినిమా తరహా పోలి ఉంటుందని… ప్రశాంత్ నీల్‌ తెలిపారు. ఇక ఈ క్రమంలోని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి కూడా కామెంట్స్ చేశాడు. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ…” ఈ మధ్యకాలంలో డైరెక్టర్ లోకేష్ ప్రతిదీ కూడా తన ముందు సినిమాలకు లింక్ చేస్తున్నాడు. సినిమాకి హైప్ రావడం కోసం నేను అలాంటి చీప్ ట్రిప్స్ వాడను ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.