రోషన్‌కి తండ్రి పాత్రలో అదరగొట్టిన ఈయన.. తెలుగు స్టార్ హీరో అన్నయ్య..గుర్తు పట్టారా..!

టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల తాజాగా హీరోగా తెరంగేట్రం చేసిన సినిమా “బబుల్గం”. మానస చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 29న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి యువతను ఆకట్టుకుంటుంది . మరి ముఖ్యంగా నేటి జనరేషన్ కి కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉండేలా చూసుకున్నాడు డైరెక్టర్ . నాటి డైలాగ్స్.. బూతు పదాలు ..హద్దులు మీరు పోయిన సీన్లు ..ముద్దులు హగ్గులు ..కొరకడాలు ..పిండడాలు పిండించుకోవడం ..

ఇలాంటివి బాగానే ఉన్నాయి . దీంతో జనాలు ఈ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . కాగా ఈ సినిమాలో రోషన్ కి తండ్రిగా నటించినా వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి . ఆయన మరెవరో కాదు మన ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరో కి బ్రదర్ . ఆయన ఎవరో అనుకుంటున్నారా ..? ఇంకెవరు మన సిద్దు జొన్నలగడ్డ.

డీజే టిల్లు గాడుగా పాపులారిటీ సంపాదించుకున్న ఈయన అన్నయ్య రోషన్ కి ఫాదర్గా నటించిన చైతూ జొన్నలగడ్డ . ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. థియేటర్స్ లో రోషన్ వచ్చినప్పుడు ఎన్ని విజిల్స్ పడ్డాయో తెలియదు కానీ చైతన్య జొన్నలగడ్డ వచ్చినప్పుడు మాత్రం ఓ రేంజ్ లో అల్లాడించేశారు జనాలు..!!