మహేష్ – బన్నీ సినిమాల్లో ఈ కోఇన్సిడెన్స్‌ గమనించారా.. సెంటిమెంట్ వర్కౌట్ అయితే మహేష్ హిట్ కొట్టినట్టే..

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇటీవల గుంటూరు కారం తెరకెక్కిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఇది మూడో సినిమా. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానున్న‌ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమాని తనదైన స్టైల్ లో మాస్ కంటెంట్‌తో అద్భుతంగా తీర్చిదిద్దారట. మునుపటి కంటే మహేష్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ అండ్‌ యంగ్ లుక్‌లో మాస్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ అంతా సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి.

ఇప్పుడు ఈ సినిమాకి మరో పాజిటివ్ వైబ్‌ తోడైంది. గతంలో అల్లు అర్జున్ అలవైకుంఠపురం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో తెలిసింది. ఈ సినిమా డిసెంబర్ 28 షూటింగ్ పూర్తి చేసుకుని 2021 జనవరి 12న థియేటర్లో రిలీజ్ అయింది. ఆ ఏడాదిలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం గుంటూరు కారం కో ఇన్సిడెన్స్‌ ఏంటంటే.. ఈ సినిమా కూడా డిసెంబర్ 28న షూటింగ్ పూర్తిచేసుకుని జనవరి 12 ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

కేవలం రెండు సంవత్సరాలు ముందు జరిగినదే మళ్లీ ఇప్పుడు రిపీట్ అయింది. త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే రెండు సినిమాలు తెరకెక్కడం విశేషం. అల వైకుంఠపురం పాజిటివ్ వైబ్స్‌ గుంటూరు కారం కి కూడా వర్క్ అవుట్ అయితే.. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ కావడం ఖాయం అంటూ అభిమానులు భావిస్తున్నారు. ఏదేమైనా త్రివిక్రమ్ తన కంటెంట్ తో మహేష్ ఫాన్స్ ఆశించిన రేంజ్ లో సక్సెస్ అందిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.