నాగ్ ” నా సామి రంగ ” హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా… ఆ స్టార్ హీరోతో కూడా రొమాన్స్ చేసిందా….!!

నాగార్జున హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ” నా సామి రంగ ” . ఇందులో నాయిక ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే . ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ వరలక్ష్మి పాత్రలో ఆకట్టుకొనుంది. ఇక ఈమె నందమూరి స్టార్ హీరో కళ్యాణ్ రామ్ సరసన ” అమిగోస్ ” అనే సినిమాలో నటించింది. ఈ ముద్దుగుమ్మ ఓ ఈవెంట్లో పాల్గొనడానికి హైదరాబాద్ వస్తే..” ఆమిగోస్ ” దర్శకుడు ఫోన్లోనే కథ‌ వినిపించి ఈ ముద్దుగుమ్మ ని ఎంపిక చేశాడట.

ఇక ఈ బ్యూటీ కర్ణాటకలో జన్మించింది. బెంగళూరులో డిగ్రీ పూర్తి చేసింది. అసలు సినిమాల్లోకి వచ్చే ఆలోచనే లేదట ఈ ముద్దుగుమ్మ కి. కాలేజీ అందాల పోటీలలో పాల్గొంటే క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ గా గుర్తింపు వచ్చిందట. ఆ పోటీలలో ఈమెని చూసిన డైరెక్టర్ కన్నడ సినిమాల్లో అవకాశం ఇచ్చాడట…అలా తెరపైకి వచ్చానంటూ ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇక పునీత్ రాజ్ కుమార్ కి ఈమె వీర అభిమాని. పరిశ్రమలోకి వచ్చి రాగానే పునీత్ సినిమాలలో నటించేందుకు అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోష పడిందట. ఇక ఆయన మరణంతో ఎంతో కృంగిపోయిందట. ఇక ఈ ముద్దుగుమ్మ కి తెలుగు బాగానే అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచే నాన్నతో కలిసి తెలుగు సినిమాలు చూసేదట ఈమె. ఇలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక రానున్న కాలంలో ఇంకెలా దూసుకుపోతుందో చూడాలి మరి.