వెంకీ మామ టాలీవుడ్ కి ఏకంగా ఇంతమంది హీరోయిన్స్ ని పరిచయం చేశాడా.. ఆ లిస్ట్ ఇదే..?!

దగ్గుబాటి వెంకటేష్.. టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ రామానాయుడు తనుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కోట్లాదిమంది ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానాన్ని దక్కించుకున్న వెంకటేష్.. పేరు తెలియని వారు ఉండరు. ఇక వెంకటేష్ నటించిన చంటి, కలిసుందాం రా, సుందరాకాండ, రాజ, బొబ్బిలి రాజా, ప్రేమించుకుందాం రా, పవిత్ర బంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది.

ఇప్పటికి వెంకటేష్ 70కి పైగా సినిమాలు నటించగా.. ఈయ‌న నటించిన అన్ని సినిమాలు దాదాపు హిట్లుగా నిలిచాయి. ఇలా త‌న న‌ట‌న‌తో 8 నంది అవార్డులను గెలుచుకున్న వెంకటేష్‌కు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది అభిమానులు, సినీ ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు. ఫ్యామిలీ హీరోగా మంచి అభిమానం సొంతం చేసుకున్న వెంకటేష్.. చాలామంది స్టార్ హీరోయిన్స్‌ను టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. ఆ హీరోయిన్స్ లిస్టు ఇప్పుడు చూద్దాం.

వెంకటేష్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఫారా, ట‌బ్బు, దివ్య భారతి, గౌతమి, ప్రేమ, ఆర్తి అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంచ‌నా జవేరి, ఖుష్బూ లాంటి ఎంతో మంది హీరోయిన్స్ ని ప‌రిచ‌యం చేశాడు. సౌందర్య తో కలిసి వెంకటేష్ దాదాపు ఏడు సినిమాల్లో నటించాడు. ఇక మీనాతో కూడా దాదాపు ఐదారు సినిమాల్లో నటించిన వెంకటేష్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో చాలా సినిమాలు చేశాడు. ఆయన కలియుగ పాండవులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కూడా రాఘవేంద్రరావు దర్శకత్వం వ‌హించారు.