మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడోచ్.. ఎవరో తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేసేస్తుంది . మెగా ఫ్యామిలీకి సంబంధించి మరో హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నాడా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరోలలో సగానికి పైగా అందరూ మెగా హీరోలు ఉండడమే గమనార్హం. కాగా ఇలాంటి మూమెంట్ లోనే మరో కొత్త హీరో కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ ఉండడంతో ఫ్యాన్స్ హంగామా చేస్తుండగా మరికొందరు ట్రోల్ చేస్తున్నారు .

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీలో ఎంత మంచి సక్సెస్ అందుకున్నాడో మనకు తెలిసిందే . అల్లు అర్జున్ (కజిన్) బావమరిది విరాన్ ముత్తం శెట్టి ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అవుతున్నాడు. ముఖ్య గమనిక అనే సినిమా ద్వారా త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా రాబోతున్నాడు . క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు . ప్రముఖ డైరెక్టర్ బాబీ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు.

పలు విజయవంతమైన చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన వేణు మురళీధర్ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. దీంతో ఈ కొత్త హీరోకి సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . అయితే కొంతమంది మాత్రం ఇండస్ట్రీని మీరే ఏలుతారా..? కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వరా అంటూ మెగా ఫ్యామిలీ పై మండిపడుతున్నారు..!!