ఆర్జీవీకి మరో భారీ దెబ్బ…” వ్యూహం ” మూవీ కేసులో విచారణ వాయిదా… దారుణంగా ట్రోల్స్ చేస్తున్న హేటర్స్…!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. ఇక ఈయన తాజాగా తెరకెక్కిస్తున్న పొలిటికల్ మూవీ ” వ్యూహం “. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందించాడు ఆర్జీవి.

అయితే ఈ మూవీలో జగన్ను పాజిటివ్గా.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిని నెగిటివ్గా చూపించడం జరిగిందని నేపథ్యంలో.. ఈ మూవీ రిలీజ్ ను నిలిపివేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేసు వేశారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ” వ్యూహం ” సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయాలని కోరుతూ నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు తీర్పు ఇవ్వాల్సి ఉంది.

అయితే తెలంగాణ హైకోర్టు ఈ కేసు విచారణ వాయిదా వేస్తూ.. 28వ విచారణ చేపడతారని తెలిపింది. ఇక 29న ఈ సినిమా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉండగా.. ఈ టైంలో కేసు వాయిదా పడడం ఆర్జీవి కు మరోసారి షాక్ తగిలిందనే చెప్పాలి. ఇక దీంతో టీడీపీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.