సైలెంట్ గా రాత్రికి రాత్రి పెళ్లి చేసుకోవడానికి కారణం ఇదే.. అమలాపాల్ అడ్డంగా దొరికిపోయిందిగా…??

ఇండస్ట్రీలో చాలామంది హీరో, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలాగే కొందరు హీరోయిన్లు సైతం రెండో పెళ్లి కూడా చేసుకుంటున్నారు. అలాగే స్టార్ హీరోయిన్ అమలాపాల్ అదే లిస్టులో చేరింది. ఈ ముద్దుగుమ్మకు ఇదివరకే పెళ్లి జరిగింది. అనంతరం భర్తతో విడిపోయి విడాకులు తీసుకుందట. ఇటీవల కాలంలో డైరెక్టర్ జగత్ దేశాయ్ తో డేటింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈమె బర్తడే సందర్భంగా..జగత్ ప్రపోజ్ చేయడంతో ఈమె కూడా ఓకే చెప్పింది. ఆ సమయంలో వీరిద్దరూ రింగులు సైతం మార్చుకున్నారు. అనంతరం నవంబర్ 5న సడన్గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ప్రేమ గురించి తెలిపాక కరెక్టుగా 10 రోజులలో ఈ అమ్మడు పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఇది పక్కన పెడితే తాజాగా అమలాపాల్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమలాపాల్ ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఆమె ప్రెగ్నెన్సీ అట. అందుకే ఎటువంటి చప్పుడు లేకుండా.. రాత్రికి రాత్రే పెళ్లి చేసుకుందట. అంతేకాదు ఈమె శరీరంలో మార్పులు సైతం వచ్చాయంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.