వ‌రుణ్ పెళ్లిలో గిరిజ‌న బ్యూటీలా మెరిసిన‌ సుస్మిత‌.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

సుస్మిత కొణిదెల గురించి ప్రత్యేకమైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు అయిన సుస్మిత‌.. మొద‌ట త‌న తండ్రికి కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా ఇండ‌స్ట్రీలో త‌న కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత సొంతంగా ప్రొడెక్ష‌న్ హౌస్ ను ప్రారంభించి నిర్మాత‌గా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా సుస్మిత ఓ ఖ‌రీదైన డ్రెస్ తో వార్త‌ల్లో నిలిచింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంతా వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి కోసం గ‌త వారం ఇట‌లీ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. నిన్న వీరి వివాహ వేడుక అంగరంగ వైభ‌వంగా జ‌రిగింది. మూడు ముళ్ల బంధంతో టాలీవుడ్ ప్రేమ ప‌క్షులు ఒక‌టి అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అయితే పెళ్లి తంతుకు ముందుకు కాక్‌టెయిల్‌, మెహందీ, హ‌ల్దీ వేడుక‌లు జ‌రిగాయి.

వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి హ‌ల్దీ వేడుక‌లో సుస్మిత గిరిజ‌న బ్యూటీలా మెరిసింది. హైదరాబాద్‌కు చెందిన డిజైన‌ర్ మృణాళిని రావు రూపొందించిన ఎవరా కఫ్తాన్ డ్రెస్ లో సుస్మిత అంద‌రినీ ఎట్రాక్ట్ చేసింది. ఈ ముదురు ఆకుప‌చ్చ డ్రెస్ ను స్వచ్ఛమైన పట్టు వస్త్రంతో తయారు చేశారు. ఈ నిండైన డ్రెస్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది. ఎందుకంటే, సుస్మిత డ్రెస్ ధర అక్షరాలా రూ.1,79,200. ప్ర‌స్తుతం ఆన్ లైన్ లో ఈ డ్రెస్ అందుబాటులో ఉంది. సైజుల బ‌ట్టీ డ్రెస్ విలువ పెరుగుతుంది. డ‌బుల్ ఎక్స్ఎల్ అయితే రూ.1,97,120 కాగా.. 4 ఎక్స్‌ఎల్ సైజు డ్రెస్ ధర రూ.2,15,040.