చీర‌లో స‌మంత సోయ‌గాలు.. పైట ప‌క్క‌కు జ‌రిపి మ‌రీ పోజులిచ్చిన బ్యూటీ!

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో స‌మంత ఒక‌టి. సుధీర్గ కాలం నుంచి స‌క్సెస్ ఫుల్ గా కెరీర్ ర‌న్ చేస్తున్న స‌మంత‌.. మ‌రోవైపు వ్యాపార రంగంలోనూ దూసుకుపోతోంది. కొన్నేళ్ల క్రితం `సాకి` పేరుతో సొంతంగా దుస్తుల బ్రాండ్ ను స్టార్ట్ చేసింది. ఆన్ లైన్ లో దుస్తులు విక్ర‌యిస్తూ సూప‌ర్ స‌క్సెస్ అయింది. తాజాగా త‌న బ్రాండ్ దుస్తుల‌ను సమంత ప్ర‌మోట్ చేసే ప‌నిలో ప‌నిలో ప‌డింది.

ఇందులో భాగంగానే చీరలో ఒంపులు పోతూ ఫోటోషూట్ చేసింది. త‌న అందాల సోయ‌గాలతో మ‌రోసారి కుర్రాళ్ల‌ను అల్లాడించేసే ప్ర‌య‌త్నం చేసింది. పైట ప‌క్క‌కు జ‌రిపి మ‌రీ హాట్ హాట్ గా ఫోటోల‌కు పోజులిచ్చింది. టాప్ షోతో టాప్ లేపేసింది. స‌మంత తాజా ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. స‌మంత రీసెంట్ గా ఖుషి మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాప్ తెచ్చుకున్నా కూడా క‌మ‌ర్షియ‌ల్ గా హిట్ అవ్వ‌లేక‌పోయింది. ఇక ప్ర‌స్తుతం స‌మంత అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా కొద్ది నెల‌లు సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంది. మ‌యోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఆమె ప్ర‌య‌త్నిస్తోంది.