గుంటూరు కారం తొలి లిరికల్ వీడియో సాంగ్‌ మరింత ఆలస్యం..అన్నీ తప్పులేనా..?

మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో‘గుంటూరుకారం’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు నిర్మాతగా సూర్యదేవర నాగవంశీ వ్యవహరిస్తన్నాడు. అయితే ఈసినిమా ఏ ముహూర్తంలో మొదలైందో గానీ.. సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పట్నుంచీ నిన్నమొన్నటివరకూ రకరకాల వార్తలు, ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కథానాయికల మార్పులంటూ కొద్దిరోజులు.. కాదు కాదు.. స్క్రిప్ట్‌లో దర్శకుడు త్రివిక్రమ్‌ మార్పులు చేర్పులు చేశారంటూ వార్తలు వస్తోన్నాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవతుందనే దానిపై ప్రిన్స్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఎట్టకేలకు ఈ సినిమాపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓ క్లారిటీ ఇచ్చేశారు.

జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు టీజర్ తప్ప మరొకటి రాలేదు. మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని ఈ దసరా కి విడుదల చేస్తారనే వార్తలొచ్చాయి. కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. దీనిపై తాజాగా నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు. సినిమా మీద అంచనాలు మామూలు స్థాయిలో లేదని, ఆ అంచనాలను అందుకునే విధంగానే తాము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పాడు. మొదటి లిరికల్ వీడియో సాంగ్ లో చాలా తప్పులు ఉన్నాయని, ఆ తప్పులను సరి చెయ్యడానికే తమకు సమయం సరిపోయిందని బయటపెట్టాడు. అందుకే లిరికల్ వీడియో సాంగ్ ఇంత ఆలస్యం అయ్యిందని అన్నాడు.

నిర్మాత నాగవంశీ కామెంట్స్ తో రిరికల్ వీడియోపై సినీ వర్గాల్లో అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. అన్ని సార్లు కరెక్షన్ చేసారంటే ఈ వీడియోలో ఎన్ని తప్పులు ఉన్నాయో అర్థమవుతందని గుసగుసలాడుకుంటున్నారు. ఈ సినిమాను థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు గత కొంతకాలంగా మహేష్ కి థమన్ సరైన మ్యూజిక్ ఇవ్వడం లేదు. దీంతో ఈ సారైనా మంచి మ్యూజిక్ ఇస్తారేమోనని ఆశ పడుతున్నారు.