నమ్ముకున్న కుటుంబ సభ్యులే నరకంలోకి తోశారు షకీలా షాకింగ్ కామెంట్స్..!!

దక్షిణాది ప్రేక్షకులకు నటి షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు మలయాళంలో ఒక ఊపు ఊపేసిన షకీలా ఈమె సినిమా విడుదలవుతున్నాయి అంటే చాలు స్టార్ హీరోల సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసుకునే అంతలా పాపులారిటీ సంపాదించుకుంది. అలా ఇమే సినిమాల దాటికి భారీ చిత్రాలే కొట్టుకుపోయాయని ఇప్పటికి వార్తలు వినిపిస్తూ ఉంటాయి. తమిళనాడు ప్రాంతానికి చెందిన షకీలా నటించిన చాలా సినిమాలలో గ్లామర్ తో ఊపేసింది.

ఒకప్పుడు షకీలా నటించిన ఎన్నో సినిమాలు అశ్లీలతో ఉంటాయి.. షకీలా తమిళ్ తెలుగు చిత్రాలతో పాటు పలు రియాల్టీ షోలలో కూడా నటించింది పలు టెలివిజన్ కార్యక్రమాల ద్వారా హాస్య పాత్రలలో కూడా నటించింది కుటుంబ ప్రేక్షకులకు ఇష్టమైన నటిగా మారిన షకీలా తనకు వచ్చే సంపాదనలో కొంతమేరకు సామాజిక సేవా కార్యక్రమంలో కూడా ఖర్చు చేస్తూ ఉండేది. కుటుంబ పోషణ కోసం షకీలా చిన్న వయసులోని సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది ఈ విషయాన్ని ఎన్నో సందర్భాలలో ఈమె డైరెక్టుగానే చెప్పేసింది.

తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి షకీలా మాట్లాడుతూ.. సినీ ప్రపంచం ఆమె ప్రతివను సరిగ్గా వినియోగించుకోలేదని కేవలం తన శరీరాన్ని అందాన్ని మాత్రమే చూపించి డబ్బు సంపాదించుకున్నారని తెలియజేసింది.. కేవలం డబ్బు కోసమే నా శరీరాన్ని మొదట ఉపయోగించిందని తన సొంత తల్లి అలాంటి పని చేసిందని తెలిపింది షకీలా.. చిన్న వయసులోనే తాను బలంగా కనిపించే దానిని వయసుకు మించి తన హైటు ఉండేదని హైస్కూల్లో చదువుతున్నప్పుడు కాలేజీ అమ్మాయిల కనిపించాను చాలామంది తనను అదే పనిగా చేసేవారు. కానీ ఎందుకో అర్థం కాలేదు మా ఇంట్లో డబ్బు సమస్య ఉండేది మా అమ్మ మగవాళ్ళను పరిచయం చేసి వాళ్లను గదిలోకి వెళ్ళమని చెబుతూ ఉండేది..దానికి నేను ఒప్పుకునే దానిని కాదు.. ఆ సమయంలో తన తల్లి కొడుతూ ఉండేదని తెలిపింది. చేసేదేమీ లేక నోరు మూసుకుని ఉండేదాన్ని తెలిపింది షకీలా.